నాడు నేడు చుట్టూ ప్రశ్నోత్తరాలు

జగన్‌ తన ప్రభుత్వంలో చేపట్టిన ప్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌లో నాడు నేడు ఒకటి. అసెంబ్లీ సమావేశాల్లో దీని చుట్టూ చర్చ జరిగింది. అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు.

Byline :  The Federal
Update: 2024-07-23 06:23 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నాడు నేడు హాట్‌ టాపిక్‌గా మారింది. రెండో రోజు సమావేశంలో నాడు నేడుపైన సభ్యులు మాట్లాడారు. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు టీడీపీ సభ్యులు నాడు నేడుకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు.

టీడీపీ సభ్యులు తాడి కొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాతుడూ నాడు నేడు పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, వీటిపైన విచారణ జరపాలని సభ దృష్టికి తెచ్చారు. జగన్‌ ప్రభుత్వం వారికి నచ్చిన కాంట్రాక్టర్లకే పనుల కాంట్రాక్టర్లు కట్టబెట్టారని, పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పలు ప్రాంతాల్లో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని, పాఠశాలల పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు తీసుకున్నారని సభలో ప్రస్తావించారు. పలు పాఠశాలల్లో ఫ్లోరింగ్‌ బాగున్నప్పటికీ, వాటిని పగులగొట్టి గ్రానైట్‌ వేశారని, వీటి కోసం పెద్ద ఎత్తున్న అంచనా వ్యయం పెంచి దోపిడికీ పాల్పడ్డారని సభలో జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పలు స్కూళ్లల్లో మరుగు దొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని, వీటిపైనా విచారణ చేపట్టాలని కోరారు. జగన్‌ పార్టీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తారని, జగన్‌మోహన్‌రెడ్డే తన పార్టీ నేతలను కాంట్రాక్టర్ల అవతారమెత్తించారని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. నాడు నేడు పనుల ముసుగులో పలు ప్రాంతాల్లో వర్కులు చేపట్టి కూడా పాఠశాలలను క్లోజ్‌ చేయించారని విమర్శలు చేశారు.
అనంతరం మంత్రి నారా లోకేష్‌ ఈ అంశాలపై మాట్లాడుతూ జగన్‌ ప<భుత్వంలో చేపట్టిన నాడు నేడు పనుల్లో అవకతవకలు జరిగాయని, వీటిపైన సమగ్ర విచారణ చేపడుతామని ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో ఎంత నిధులు ఖర్చు చేశారు, ఎంత మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి, నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు పూర్తి స్థాయిలో ఎందుకు జరగ లేదు వంటి పలు అంశాలపైన విచారణ జరుపుతామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను డెవలప్‌ చేస్తామన్నారు. దీని కోసమే మెగా డీఎస్సీని కూడా ప్రకటించామన్నారు.
జగన్‌ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేసింది. ఒక ఫ్లాగ్‌ ఫిప్‌ ప్రోగ్రామ్‌గా దీనిని అమలు చేసింది. జగన్‌ ప్రభుత్వం తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేట్టామని చెప్పుకున్న నాడు నేడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా టార్గెట్‌ చేసింది. పనులు సరిగా చేయలేదని, వైఎస్‌ఆర్‌సీపీ నేతలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని, నాసిరకం పనులు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు గుప్పించింది. దీనిపై జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
Tags:    

Similar News