రామచ్ చరణ్ తొలి సినిమాకు 17 ఏళ్లు
మెగాస్టార్ తనయుడు రామ్‌చర్. ఆయన వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడా ట్వీటర్ వైరల్‌గా మారింది.
Byline : Vijaykumar Garika
Update: 2024-09-28 06:40 GMT
అప్పటికే చిరంజీవి తెలుగు తెరపై రారాజుగా వెలుగొందుతున్నారు. తిరుగులేని హీరోగా చరిత్ర సృషించారు. తన డ్యాన్స్‌లు, ఫైట్‌లు, పాటలతో అలరించారు. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రలో అడుగు పెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాదరావు చిరంజీవిగా మారి సొంత టాలెంట్‌తో ఎదిగి మెగాస్టార్‌గా గౌరవ మన్ననలు పొందారు. ఆ స్థానానికి చేరుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలు భరించారు. చివరికి చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మెగాస్టార్‌గా ఎదిగారు.
అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న చిరంజీవికి ఏకైక కూమారుడు రామ్‌చరణ్. అప్పటికే చిరంజీవి వారసులుగా రంగ ప్రవేశం చేసిన సోదరులు పవన్ కళ్యాణ్ హీరోగాను, మరో సోదరుడు నాగబాబు నటుడు, నిర్మాతగాను నిలదొక్కుకున్నారు. అయితే తన అసలైన వారసుడిగా తన కుమారుడు రామ్‌చరణ్‌ను సిల్వర్ స్రీన్‌పైన హీరోగా చూడాలనుకున్నారు చిరంజీవి. ఆయన మాదిరిగానే మరో మెగాస్టార్‌గా రికార్టులు సృష్టిస్తే చూడాలని కలలకు కన్నారు. ఆ భావాలను మనసులో పెట్టుకున్నారు. చిరంజీవి అడగాలే కానీ తన కుమారుడుని తెరంగేట్రం చేయడానికి ఎంతో మంది దర్శకులు క్యూలో ఉంటారు. కానీ ఆలోచించారు. ఎవరైతే బాగుంటారని స్టడీ చేశారు. అప్పటికే సెన్షేనల్ డైరెక్టర్‌గా మంచి ఊపు మీద ఉన్న పూరి జగన్నాథ్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. అటు సెన్షేనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇటు మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ కాంబినేషన్ అనగానే చలన చిత్ర పరిశ్రమే కాదు, ప్రేక్షక లోకం కూడా పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.
మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవికి ఎంతో మంది ఆప్తులైన ప్రొడ్యుసర్‌లు ఉన్నారు. కానీ వారిందరిలో అశ్వనీదత్ అంటే చిరంజీవికి ఎనలేని ప్రేమ. వారిద్దరి మధ్య హీరో, నిర్మాత బంధం కంటే స్నేహానుబంధం ఎక్కువ. ఆయన చేతుల మీదుగా లాంచ్ అయితే అదృష్టం కలిసొస్తుందనే భావన ఎక్కువ చిరంజీవికి. దీంతో తన కుమారుడు రామచ్‌రణ్ అశ్వనీదత్ బ్యానర్ వైజయంతీ మూవీస్ బ్యానర్ మీదగా లాంచ్ చేయాలని భావించి, ఆ బాధ్యతను అశ్వనీదత్‌కు అప్పగించారు. వారి ముగ్గురు కాంబినేషనల్ వచ్చిన రామ్‌చరణ్ తొలి సినిమానే చిరుత.
చిరుత పెద్ద హిట్ సాధించింది. తండ్రికి తగ్గ తనయుడుగా రామ్‌చరణ్ పేరు సంపాదించుకున్నారు. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చిరంజీవి స్టైల్‌లోనే దింపేశారు. చిరంజీవిలానే చేశారనే టాక్ అప్పట్లో వైరల్ అయింది. కలెక్షన్‌ల పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ పెద్ద హిట్ సాధించింది. 17 ఏళ్ల క్రితం చిరుత విడుదలైంది. 2007, సెప్టెంబర్ 28న ’చిరుత’ రిలీజైంది. బంపర్ హిట్ సాధించిన చితరు విడుదలై నేటితో 17 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా చిరుతకు సంబంధించి ఒక పోస్టు పెట్టింది. చిరుత విడుదలై నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. చిరుత ద్వారా రంగ ప్రవేశం చేసిన రామ్‌చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. తొలి సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చెర్రీ వండర్‌ఫుల్ సినీ కెరీర్‌కు తమ వైజయంతి మూవీస్ వేదికగా నిలచిందని పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చిరుత, రామ్‌చర్ జర్నీ సినీ వర్గాల్లో మరో సారి చర్చనీయాంశంగా మారింది.