రాయలసీమ నేత బొజ్జ దశరధ్ అరెస్టు, సర్వత్రా నిరసన
రాయలసీమ సాగునీటి సాధన సమిటి నేత బొజ్జా దశరథ్ ని ఎపుడో పెట్టిన ఒక పాతకేసులో అరెస్టు చేయడం పట్ల ప్రజాస్వామిక వాదులు నిరనన తెలుపుతున్నారు.
కర్నూలు: రాయలసీమ ఉద్యమ నాయకుడు బొజ్జ దశరధ రామిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాయలసీమ విద్యార్థి నేతలు తీవ్రంగా ఖండించారు. 2016లో రాయలసీమ నీటి హక్కుల కోసం సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపాట్టాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆయన నిర్వహించారని అదొక ప్రజాస్వామిక పోరాటమని చెబుతూ దశరథ రెడ్డి అక్రమమని, అప్రజాస్వామికమని సమితి రాష్ట్ర అధ్యక్షులు, రవికుమార్ రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, కర్నూలు అధ్యక్షులు అశోక్ పేర్కొన్నారు. దశరథ్ మీద ఉన్న కేసులను ఎత్తవేసి ఆయన వెంటనే విడుదలచేయాలని వారు కోరారు.
ప్రముఖుల ఖండన
రాయలసీమ సాగునీటి సాధానా సమితి అధ్యక్షులు బొజ్జా డసరథరామి రెడ్డి నిర్బంధం అన్యాయం. న్యాయ బాహిరం. తరతరాలుగా ప్రభుత్వాలు ఇస్తున్న హామీ రాయలసీమకు నీళ్ళు. అవి రాజ్యాంగ చట్ట బద్దమైన హక్కులు. దానిని అడిగి ఆందోళన చేస్తున్నందుకు నాయకత్వం వహిస్తున్న బొజ్జాను అరెస్ట్ చెయ్యడం నిరంకుశత్వం. బొజ్జా వెనుక మొత్తం రాయలసీమ ప్రజానీకం ఉండి అనె విషయాన్ని ప్రభుత్వం విస్మరించరాదు. సాగునీటి పోరాటం రాజకీయాలకు అతీతం. ఐతే ఇలాంటి దుశ్చర్యలు రాజకీయం ప్రవేశానికి అవకాశం: చంద్రశేఖర కల్కూర, అధ్యక్షులు, గాడిచర్ల ఫౌండేషన్ కర్నూలు.
కర్నూలులో నేడు నిరసన
రాయలసీమ సాగునీటి సాధనా సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం. ఆయన అరెస్టు కు నిరసన గా రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యలో 3-1-2024 సాయంత్రం 5-00 గం. లకు కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన వుంటుంది. రాయలసీమ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం : అరుణ్, విజయ భాస్కర రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక
నియంతృత్వం సహించం
దశరథ్ అరెస్టు రైతులకు మేలు జరిగే కార్యక్రమాల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు ధోరణియే. ఇలాంటి విధానం తగదు. ప్రభుత్వం బొజ్జను విడుదల చేయాలి.
నియంతత్వ పాలన కొనసాగిస్తామంటే రాయలసీమ రైతాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తాం: యాగంటి బసవేశ్వర రైతు సంఘం గౌరవ అధ్యక్షులు మూలా రెడ్డి, కార్యదర్శి శివకృష్ణ యాదవ్, సభ్యులు గోపాల్,రమేష్ నాగిరెడ్డి నాగ సుబ్బారెడ్డి, బషీర్
ధశరథ్ ని ఎందుకు అరెస్టు చేశారు
రాయలసీమ ఉద్యమాన్ని శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిర్వహిస్తున్ననేత దశరథ్ రామిరెడ్డి, ఇది కేవలం రాయలసీమ నీటి హక్కుల కోసం సాగుతున్న ప్రజాస్వామిక ఆందోళన. ఇందులో ఓట్ల రాజకీయావేశంలేదు. ఆవేదన తప్ప. ఇపుడు రాయలసీమలో యాక్టివ్ గాఉన్న ఉద్యమం ఇదొక్కటే. అందువల్ల దశరథ్ అరెస్టు వెనక మరేదో బలీయమయిన కారణం ఉంటుందని చాలా మంది అనుమానిస్తున్నారు.
అయితే, పైకి మాత్రం ఆయన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కేసులో అరెస్టు చేశారని తెలిసింది. దశరథ రామిరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నంద్యాల సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
రాయలసీమకు సాగునీటిని ఇవ్వాలని ఆయన చాలాకాలంగా పోరాడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘సిద్దేశ్వరం అలుగు’ ఏర్పాటు చేసి రాయలసీమకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలకులు పట్టించుకోకపోవడంతో రాయలసీమ ప్రజలను సమీకరించిన దశరథ రామిరెడ్డి 2016లో సిద్దేశ్వరం వరకు పాదయాత్ర చేసి ప్రజా శంకుస్థాపన చేశారు.
ప్రతి ఏటా అక్కడే వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే సిద్దేశ్వరం పాదయాత్ర నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని. అయినప్పటికీ దశరథరామిరెడ్డి అక్కడికి వెళ్లడంతో పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈ కేసుపైనే దశరథ రామిరెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేశారుు.