స్వలాభం కోసమే అమరావతి, విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారా?

రాయలసీమ నీటిపారదుల ప్రాజెక్ట్‌లపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్ఫష్టం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బోజ్జా దశరథరామిరెడ్డి కోరారు.

Update: 2024-03-28 11:08 GMT
రాయలసీమ

రాయలసీమలోని నీటిపారుదల ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేయడంపై బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతోందని వివరించారు. ఏప్రిల్ 12 నుంచి రాయలసీమలోని ప్రాజెక్ట్‌లను సందర్శిస్తామని, ఈ సందర్శనలో ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని చెప్పారాయన. నంద్యాల సమితి కార్యాలయంలో ప్రజాసంఘాలతో తాగునీరు, సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా పాలకుల విధానాలతో రాయలసీమలోని నీటిపారదుల ప్రాజెక్ట్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నాయన్న అంశాన్ని సమాజం దృష్టికి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.


స్వార్థం కోసమే రాజధాని

ఆఖరికి రాష్ట్ర రాజధానిపై కూడా పాలకులు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తమ ఆర్థిక, రాజకీయ సామ్రాజ్యాలను విస్తరించుకోవడంలో భాగంగానే పాలకులు ఏకైక రాజధాని, మూడు రాజధానుల పేరిట అమరావతి, విశాఖలో ఏర్పాట్లు చేపడుతున్నారు. రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించే కార్యక్రమం చేపడుతున్నాం’’అని వెల్లడించారు ఆయన.
‘‘రాయలసీమ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే పాలకుల అస్తవ్యస్థ విధానాలను ప్రజల ముందు ఉంచుతాం. యువత భవితపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని మా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తాం. దాంతో పాటుగా రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటుపై, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో రాయలసీమ యువతకు 40 శాతం రిజర్వేషన్లు, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్ట్‌లను గాడిలో పెట్టడంపై పార్టీలు తమ వైఖరి, కార్యాచరణను ప్రకటించాలి’’అని ఆయన డిమాండ్ చేశారు. వీటిని ప్రజల ముందు ఉంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు.


Tags:    

Similar News