భారీ వాహనాల రాకపోకలపై హైదరాబాద్ లో ఆంక్షలు
బ్రేక్ డౌన్ అవుతున్న కారణంగా..;
ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించడానికి సైబరాబాద్ పోలీసులు నడుంబిగించారు. భారీ వాహనాలు ఇకపై రోడ్లపై యదేచ్చగా తిరగడానికి వీల్లేదు. వాటి రాకపోకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం, సాయంత్రం రోడ్లపైకి భారీ వాహనాలు రావడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి.ఇటీవల ప్రధాన రోడ్లపై భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్‌లో నిలిచిపోతున్నాయి. బుధవారం కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై డీసీఎం వ్యాను ఆగిపోయింది. ఆ మార్గంలో ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ఆ వాహనాన్ని అక్కడి నుంచి క్లియర్ చేశారు.
డీసీఎం, రెడీమిక్స్ వంటి భారీ వాహనాలను ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మాత్రమే అనుమతిస్తారు. తిరిగి రాత్రి 10.30 నుంచి ఉదయం 7.30 గంటల మధ్య రాకపోకలకు అనుమతిస్తారు. ముందస్తు అనుమతి ఉంటేనే రెడీమిక్స్ కాంక్రీట్ వాహనాలు, అన్ని మార్గాల్లో అనుమతిస్తామన్నాని పోలీసులు తెలిపారు.