నంద్యాల టీడీపీ అభ్యర్థికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Update: 2024-04-09 17:09 GMT
Source: Twitter

నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఫరూక్‌కి పెను ప్రమాదం తృటిలో తప్పింది. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాణ్యం మండలం తుమ్మరాజుపల్లె దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంగా తీవ్రంగా డ్యామేజ్ అయింది. ఫరూక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.

హుటాహుటిన ఫరూక్‌ను ప్రాథమిక చికిత్స కోసం నంద్యాలలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం ఏమాత్రం ఆలస్యం అయినా ఆయనకు తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రికి వస్తున్నారు. కాగా ఆయన క్షేమంగా ఉండటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫరూక్‌కే టీడీపీ ఛాన్స్

త్వరలో జరగనున్న ఎన్నికల్లో నంద్యాల నుంచి ఫరూక్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ సీటు కోసం ఫరూక్‌తో పాటు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ పడ్డారు. కానీ ఆయనను పక్కకు పెట్టి గత ఎన్నికల్లో నంద్యాల నుంచి విజయం సాధించిన ఫరూక్‌కే టీడీపీ మరోసారి అవకాశం కల్పించింది. నంద్యాలలోని ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసమే టీడీపీ మళ్ళీ ఫరూక్‌కు అభ్యర్థిత్వం కల్పించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీడీపీ, బీజేపీ పోత్తు నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీని ముస్లిం ఓటర్లు ఎంత వరకూ నమ్ముతారో అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీతో జతకట్టిన టీడీపీని ముస్లిం ఓటర్లు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.



Tags:    

Similar News