ఎడ్లబండ్లతోనే కాదు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గృహ నిర్మాణ దారులకు శుభవార్త చెప్పింది. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లతోనే కాదు ట్రాక్టర్ల ద్వారా కూడా తీసుకెళ్లేందుకు అనుమతులిచ్చింది.

Update: 2024-10-19 05:59 GMT

ఇసుకకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గృహ నిర్మాణ దారులకు శుభవార్త ప్రకటించింది. ఇకపై రీచ్‌ (ఇసుక క్వారీ)ల నుండి సొంత అవసరాలకు ట్రాక్టర్‌ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులను జారీ చేసినట్టు చర్చ సాగుతోంది.

ప్రజలు తమ సొంత అవసరాలకు ఇసుకను తీసుకెళ్లే విషయంలో గతంలో ఒకే విధానం ఉండేది. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉండేది. అయితే తాజాగా దీనికి వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్‌లతో కూడా ఇసుకను తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. స్థానిక అవసరాలకు మాత్రమే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని సవరణ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా సినరేజ్‌ అంశంపైన నిర్ణయం తీసుకుంది. ఇసుకపై సినరేజ్‌ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్‌ జరిమానాలు ఉండవని సీఎం వెల్లడించారు. టీటీపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో సంతోషం వెల్లువిరిసింది.
Tags:    

Similar News