కేరళ తరహాలో... ఆంధ్రాలో హర్రర్... సైనైడ్‌తో సీరియల్ మర్డర్స్..

ఒక బంగారు వ్యాపారి సాయంతో ముగ్గురు మహిళలు వరుసగా నలుగురిని హత్యలు చేశారు. కేరళలో కూడా ఇలానే..

Update: 2024-09-07 09:51 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి కేంద్రానికి చెందిన బంగారు పనిచేసే కృష్ణ అనే వ్యక్తి సైనైడ్ అమ్మి నలుగురు మృతికి కారకుడయ్యాడు. విలాసాలకు బానిసైన ఓ యువతి కృష్ణ అనే యువకుని సాయంతో ఈ హత్యలకు పాల్పడింది. ఆమె తల్లిని, మరో మహిళలను ఇందులో భాగస్వాములను చేసింది. విదేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడిన మడియాల వెంకటేశ్వరి (32) ఈ హత్యలకు ప్రధాన కారకురాలు. భర్తను వదిలేసిన వెంకటేశ్వరి.. కృష్ణ అనే యువకునితో సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సైనైడ్ కొనుగోలు చేయాలంటే అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలి. అనుమతులు బంగారు వ్యాపారులు తీసుకుంటారు. బంగారం, వెండి ఆభరణాల తయారీలో సైనైడ్‌ను వాడుతారు. వెంకటేశ్వరి.. కాంబోడియా దేశం వెళ్లి రావడం వల్ల ఈ వ్యవహారాలు బాగా వంటబట్టించుకుంది. కృష్ణ సాయంతో రూ.4 వేలు చెల్లించి సైనైడ్ కొనుగోలు చేసింది. దీనిని ఉపయోగించి సీరియల్ హత్యలకు పాల్పడింది. ఇటువంటి ఘటనే గతంలో కేరళలోని కూడతాయి ప్రాంతంలో కూడా జరిగింది. ఆ ఘటనలో కూడా సైనైడ్ ప్రధాన ఆయుధంగా వరుస హత్యలకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఇప్పుడు ఇటువంటి ఘటనే ఏపీలో కూడా వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.

Delete Edit

ముగ్గురు మహిళలు వరుస హత్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎవ్వరూ చేయని విధంగా సైనైడ్ ఇచ్చి వరుస హత్యలకు పాల్పడ్డారు. మునగప్ప రజిని (40), మడియాల వెంకటేశ్వరి (32), గొంతు రమణమ్మ(60) లను పోలీసులు తెనాలి లింగయ్య కాలనీకి చెందిన ‘సీరియల్ కిల్లర్స్’ గా గుర్తించారు. అపరిచితులతో స్నేహం చేసి, వారికి సైనైడ్ కలిపిన పానీయాలు అందించి, వారు మరణించిన తర్వాత వారి బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తారు. అలాగే పలువురి వద్ద అప్పులు తీసుకుని వారు ఒత్తిడి తెస్తే వారిని కూడా సైనైడ్ తోనే హతమారుస్తూ వచ్చారు. ఆస్తుల కోసం సొంత బంధువులను కూడా సైనైడ్ సఫా చేసేశారు. హతమార్చారు.

ఈ ముగ్గురికి ముగ్గురు మహిళలు సహా నాలుగు హత్యలతో సంబంధం ఉంది. ఈ ఏడాది జూన్‌లో నాగుర్‌ బి అనే మహిళను లక్ష్యంగా చేసుకుని వారి హత్యాకాండ మొదలైంది. మరో ఇద్దరు బాధితులు సైనైడ్ కలిపిన పానీయాలు తాగినా ప్రాణాలతో బయట పడ్డారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సైనైడ్, ఇతర నేరారోపణ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళలకు విషం సరఫరా చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

నిందితుల్లో ఒకరైన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి నేరాలకు కొత్తేమీ కాదు. 32 ఏళ్ల ఆమె కంబోడియాకు వెళ్లడానికి ముందు నాలుగు సంవత్సరాలు తెనాలిలో వాలంటీర్‌గా పనిచేసింది, కంబోడియాలో సైబర్ నేరాలకు పాల్పడింది. సీఏ చదువుతూ మధ్యలో ఆపేసింది. ఆమెకు మొదటి నుంచీ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఆమె భర్తను వదిలేసి తల్లి రమణమ్మతో ఉంటుంది. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని తల్లితో కలిసి చంపేశారు. వీరికి రజిని, భూదేవి అనే వారు సహకరించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో ఆమెకు మద్యంలో సైనేడ్ కలిపి తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి తాపించారు. దీంతో సుబ్బలక్ష్మీ మరణించారు. బాకీ చెల్లించాలని అడుగుతోందని 2023 ఆగస్ట్ లో వృద్ధురాలు నాగమ్మను కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. 2024 ఏప్రిల్ లో పీచు అలియాస్ మోషే భార్య భూదేవిని తరచూ వేధిస్తున్నాడని భూదేవి, రమణమ్మలు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. మోషేను చంపితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని మద్యంలో సైనైడ్ కలిపి హత్య చేశారు. ఈ ఏడాది జూన్ లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజినితో కలిసి నాగూర్బీ అనే మహిళను మంచి మాటలతో తీసుకుపోయి బ్రీజర్ లో సైనైడ్ కలిపి తాపించి హత్య చేశారు. తెనాలికి చెందిన అన్నపూర్ణ, వరలక్ష్మి, మీరాబీలపై హత్యాయత్నం చేశారు.

Delete Edit

ఒక మహిళ మృతదేహం వీరిని పట్టించింది

ఈ ఏడాది జూన్ 5న చేబ్రోలు మండలం వడ్లమూడి శివారు ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉంది. అప్పటి ఎస్ఐ మహేష్ కుమార్ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ప్రస్తుత ఎస్ఐ వెంకటకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్బీగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన రజిని, నాగూర్ బీ వద్ద అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్ననాగూర్ బిని ఎలాగైనా చంపించాలనే ఆలోచన చేసింది. ఈ విషయం వెంకటేశ్వరికి చెప్పడంతో అంతా కలిసి పథకం ప్రకారం హతమార్చారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రజిని, నాగూర్ బి వెళ్లిన ఆటోను గుర్తించారు. రజినిని అదుపులోకి తీసుకుని పోలీసులు కూపీ లాగారు. దీంతో తల్లి రమణమ్మ, కుమార్తె వెంకటేశ్వరిలు చేస్తున్న సీరియల్ హత్యలు బయటపడ్డాయి. పోలీసు సూపరింటెండెంట్ సతీష్ కుమార్ నేతృత్వంలోని తెనాలి పోలీసులు తమ విచారణలో హత్యలు చేసినట్లు, మహిళలు అంగీకరించారని వెల్లడించారు.

‘తెనాలికి చెందిన నాగూర్‌ బీ అనే మహిళను నమ్మకంగా నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి బ్రీజర్‌లో సైనైడ్‌ ఇచ్చి చంపేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసులు ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించడంతో తెనాలికి చెందిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ సైనైడ్‌తో వరుస హత్యలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమెకు తోడు మరో మహిళ కూడా కలిసి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. బుజ్జి తన అత్తకు కూడా సైనైడ్‌ ఇచ్చి చంపింది. ఆ తర్వాత తెనాలిలో ఓ వృద్ధురాలి వద్ద డబ్బు, బంగారం చూసి ఆమెను ఇదే తీరులో హతమార్చారు.’ సతీశ్ ​కుమార్‌, ఎస్పీ

ఈ కేసు కేరళలో జరిగిన అపఖ్యాతి పాలైన జాలీ జోసెఫ్ సైనైడ్ హత్యతో పోల్చబడింది, ఇక్కడ ఒక మహిళ సైనైడ్‌తో విషపూరితం చేసి 14 ఏళ్లలో ఆరుగురు వ్యక్తుల మరణానికి కారణమైంది. తెనాలి సంఘటన ప్రజలలో భయం రేకెత్తించింది. తెలియని వ్యక్తులను విశ్వసించడం వల్ల కలిగే ప్రమాదాలను వారికి గుర్తుచేస్తుంది. తెనాలి హంతకురాళ్లు మూడేళ్లలో నాలుగు హత్యలు చేశారు.

Tags:    

Similar News