ఏపీలో తీవ్రమైన వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్ లోని 108 మండలాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బయట పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.;
బుధవారం (26-03-25) శ్రీకాకుళం జిల్లా -15, విజయనగరం జిల్లా-21, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2 ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు (108) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
బుధవారం వడ గాల్పులు వీచే మండలాల (108) పూర్తి వివరాలు క్రింది లింక్ లో..
https://apsdma.ap.gov.in/files/d8ca31b00b0162b5b914991d4aae77b0.pdf
మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9°C, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పిపల్లి, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 40.1°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే 15 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని తెలిపారు.