జగన్, చంద్రబాబులను ఉతికిపారేసిన షర్మిల

బీజేపీని టార్గెట్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల ప్రసంగం కొనసాగింది. జగన్, చంద్రబాబులను ఒక ఆట ఆడుకున్నారు. పీసీసీ బాధ్యతలు తీసుకున్న తరువాత ఆంధ్రరత్న భవన్‌కు వచ్చారు.

Byline :  The Federal
Update: 2024-01-21 11:44 GMT
ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటున్న వైఎస్‌ షర్మిలరెడ్డి

ఎన్నికలప్పుడు ఏమి చెప్పారు. ఇప్పుడు ఏమి చేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం, ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఒక్కరోజైనా రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాడారా? అంటూ ఇద్దరు నేతలను ఉతికిపారేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి. ఆదివారం విజయవాడలోని ఆహ్వానం కళ్యాణమండపంలో జరిగిన సభలో ఏపీసీసీ చీఫ్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రానికి కొత్త సమస్యలు తెచ్చారు తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. పది లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ రెడ్డి అంటూ ఆమె ప్రసంగం కొనసాగింది. ఇరువురు తోడుదొంగని చెప్పకనే చెప్పారు.


Delete Edit


తత్యేక హోదా విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు నాటకాలు ఆడిన తీరుపై ఆమె చేసిన విమర్శలు పలువురిలో చర్చకు దారితీశాయి. 25 మంది ఎంపీలతో ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్‌ గెలిచిన తరువాత ఒక్కరోజైనా ఆ విషయం మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు హోదా ఇవ్వడం ద్వారా పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబు మోదీ క్యాబినెట్‌లో మంత్రి పదవులు తీసుకుని కూడా హోదా గురించి అడగకపోవడం చేతకాని తనం. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు సీఎం వైఎస్‌ జగన్‌ తాకట్టు పెట్టారని విరుచుకు పడటం విశేషం.
బీజేపీకి అమ్ముడు పోవడానికి రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నుంచి పోటీ పెట్టడాన్ని తప్పుపట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీకి మధ్య పొత్తు ఉందని షర్మిల వ్యాఖ్యానించడం ఆయా పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీతో ఇరు పార్టీల వారు వ్యవహరిస్తున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు ఆమె చెప్పడం పలు ఆలోచనలకు తావునిచ్చింది. ఆమె చే సిన ప్రసంగం టార్గెట్‌ బీజేపీగా ఉంది. రాష్ట్రంలోని చంద్రబాబు, వైఎస్‌ జగన్‌లను విమర్శిస్తు బీజేపీకి ఇద్దరూ తొత్తులుగా మారిన విషయం ఆమె ప్రసంగంలో స్పష్టమైంది.
షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రరత్న భవన్‌లోని తన చాంబర్‌లో కాసేపు కూర్చున్నారు. వచ్చిన వారందరినీ భోజనాలు చేయల్సిందిగా కోరారు.
Tags:    

Similar News