ఆంధ్రరత్న భవన్‌లో బస చేసిన షర్మిల

పోలీసుల వ్యూహాన్ని భగ్నం చేస్తూ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల బుధవారం రాత్రి బస చేశారు. చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు.

Update: 2024-02-21 20:14 GMT
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిద్రపోతున్న షర్మిల

కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బస చేశారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ చలో సెక్రటేరియట్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. ఈమేరకు విజయవాడ చేరుకున్న షర్మిల కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఉండాలనుకున్నారు. ఆమెను ఇంట్లోనే హౌజ్‌ అరెస్ట్‌ చేయాలని పోలీసులు సిద్ధం కావడంతో గమనించిన షర్మిల పోలీసుల వ్యూహాన్ని భగ్నం చేస్తూ ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే బస చేశారు. గురువారం ఉదయం చలో సెక్రటేరియట్‌ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించారు. అయితే పోలీసులు పార్టీ కార్యాలయం వద్దనే అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాత్రి అంతా సివిల్‌ పోలీసులను అంధ్రరత్న భవన్‌ చుట్టూ కాపలా పెట్టారు.


Delete Edit


పోలీసుల తీరుపై స్పందించిన వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. పోలీసుల తీరును దుయ్యబట్టారు.
‘నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్‌ అరెస్ట్‌లు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌజ్‌ అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా?
మేము తీవ్రవాదులమా.. లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు’. అంటూ నాయకులు, కార్యకర్తల్లో ఉద్యమ స్పూర్తిని నింపే ప్రయత్నం చేశారు.
Tags:    

Similar News