ఎస్సీ,ఎస్టీల కోసం జగన్‌పై షర్మిల నవ భాణాలు
ఎస్సీ, ఎస్టీలు స్వతహాగా కాంగ్రెస్ ఓటర్లు. వైఎస్‌ఆర్ పేరు చెప్పి జగన్ తమ వైపు తిప్పుకున్నారు. వారికి ఏ ఒక్కటి అందకుండా చేశారంటూ జగన్‌కు షర్మిల లేఖాస్త్రం.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళిత, గిరిజన ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర విభజనకు ముందు 2009 వరకు ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటర్లుగా ఉండేవారు. ఈ రెండు వర్గాల మద్దతు కొంత తెలుగుదేశం పార్టీకి ఉన్నా అధిక శాతం మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం, తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని జగన్ ఏర్పాటు చేయడం, అప్పటి వరకు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, గిరిజన వర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ వైపు టర్న్ కావడంతో కాంగ్రెస్‌కు ఏమి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలను టార్గెట్‌గా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. తాజాగా వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాసిన బహిరంగ లేఖ కూడా ఇదే విషయాన్ని స్పష్ట చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చగా కూడా మారింది. బుధవారం రాసిన బహిరంగ లేఖలో తొమ్మిది ప్రశ్నలను షర్మిల సంధించారు. వీటికి బదులివ్వాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు.