Srikalahasti| శివయ్య గుడిలో VIP లేఖ చెల్లదు...

ఆలయాల దర్శనంలో సామాన్య యాత్రికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కొనసాగుతుందా? సామాన్యుడికి పట్టం కట్టం సాధ్యమేనా?

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-11-20 04:09 GMT

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిగతా విషయాలను పక్కన ఉంచితే, సామాన్య యాత్రికులకు ఇది ఒకరకంగా మేలు చేసేదిగానే ఉంది.

చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. ఈ ఆలయాల వ్యవహారాలపై ప్రజాప్రతినిధులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడి ముందు అందరూ సమానమే. సామాన్యులతో పాటు వీఐపీలు కూడా టికెట్ కొనాల్సిందే అంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత..
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి (శ్రీ అంటే సాలీడు. కాళ అంటే పాము. హస్తి అంటే ఏనుగు) క్షేత్రానికి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి MLA, MPలు తాకిడి ఎక్కుగానే ఉంటుంది. వారి సిఫారసు లేఖలతో వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది.
"వారంతా ఖచ్చితంగా టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి పంపండి. ఆలయ అధికారులు కూడా ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని" కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాళహస్తి ఆలయంలో ఇటీవల స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం- 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన అధికారులతో సమీక్షించారు. "ప్రజాప్రతినిధులు, ప్రోటోకాల్ అధికారుల సిఫారసు లేఖలు తీసుకువచ్చే వారి నుంచి దర్శన్ టికెట్ కొనుగోలు చేయించండి" అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ అధికారులు కూడా దీనికి సహకారం అంచాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. సామాన్య యాత్రికులు ఎక్కడా ఇబ్బంది పడకూడదదు అనేది ఆయన సూచన.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు సగటున 65 వేల నుంచి 85 వేల మంది వరకు యాత్రికులు వస్తుంటారు. వారిలో కనీసంగా అంటే సగం వంతు యాత్రికులు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. సాధారణ రోజుల్లో ఒక రకంగా, వారాంతపు సెలవుల్లో మరింత రద్దీగా ఉంటుంది.
జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీకాళహస్తి దేశంలోనే కాకుండా తిరుమల సలహాలు అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది. విదేశీ భక్తులు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. దీనికంటే ప్రధానంగా, ఈ ఆలయంలో రాహు-కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. అందువల్ల తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, అత్యధికంగా తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు.
శ్రీకాళహస్తి ముక్కంటి క్షేత్రంలో రాహు-కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటూ ఉంటారు. వీరంతా వేలాది రూపాయలు టికెట్లు కొనుగోలు చేసి, దోష నివారణ పూజల అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
సేవా టికెట్లు తీసుకున్న వారితోపాటు సామాన్య యాత్రికులకు కూడా వీఐపీలు, VVIP, protocol సిఫారసు లేఖలు, దర్శనాలతో ఇబ్బందికరంగా మారినట్లు భావిస్తున్నారు. సామాన్య యాత్రికులు క్యూ లో నిరీక్షిస్తూ ఉంటే, మిగతా వారంతో దర్జాగా వెళ్లడం కూడా అసంతృప్తికి ఆస్కారం కల్పిస్తోంది. దీంతో


టికెట్ ధర ఎంత అంటే
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలు ఆర్జిత సేవలకు టికెట్ ధర నిర్ణయించారు.
సామాన్య యాత్రికుడికి
1. సర్వదర్శనం : సామాన్య యాత్రికులు క్యూలో వెళ్లాలి.
2. రూ. 50 టికెట్: తీసుకున్న వారిని రంగులగోపురం (పాతాళ వినాయకుడి గుడి) దగ్గర నుంచి ఆలయంలోకి చుట్టూ తిరిగి క్యూలో వెళ్లాలి.
3. రూ. 200 టికెట్: తీసుకుంటే, ఆలయ అంతర్భాగంగా ఉన్న కోటమండపం (పొన్నచెట్టు సమీపంలో) నుంచి సమీపంలో ఉన్న కంచుగడప (మహద్వారం) నుంచి ఆలయంలోకి నేరుగా ప్రవేశించినా, మొదటి రెండు లైన్లతో సంబంధం లేకుండా స్వామివారి సన్నిధి వద్దకు వెళ్లడానికి వేరుగా లైన్ ఉంటుంది.

రాహు-కేతు పూజలు
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. దీనిలో వివిధ రకాల ధరతో సేవా టికెట్లు ఉన్నాయి. ఈ పూజలు చేయించుకోవాల్సిన వారు తప్పనిసరిగి సాంప్రదాయ దుస్తులు ధరించాలని శ్రీకాళహస్తి ఆలయ ఈవో
1. రూ. 500, 750 : టికెట్ తీసుకున్న వారికి రాయలమండపం
2. రూ.1,500 టికెట్ తీసుకున్న వారికి వంటశాల సమీపంలో పూజలు చేయిస్తారు.
3. రూ. 2,500 టీకెట్ తీసుకున్న వారికి కల్యాణోత్సవ మండపం
4. రూ. ఐదువేల టికెట్ తీసుకున్న దంపతులకు అంతరాలయంలోని సహస్రలింగం వద్ద రాహు -కేతు పూజలు పండితులు చేయిస్తారు.
ఏ టికెట్ తీసుకున్నా, పూజా విధానం ఒకే విధంగా ఉంటుంది. కాకుంటే, ఆలయంలో వేదిక మాత్రమే మారుతుంది.
అభిషేక సేవలు
శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవారికి నాలుగుకాలాల్లో నాలుగుసార్లు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే వారు రూ. 1,500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ అభిషేక సేవ ఉదయం ఆరు గంటలకు ఒకసారి, 7.30 నుంచి ఎనిమిది గంటల మధ్య, 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య మరోసారి చివరిగా అభిషేక సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత, ప్రత్యేక దర్శన టికెట్లు కాకుండా, రోజుకు 30 రకాల ఆర్జితసేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో నిత్యకల్యాణోత్సవం టికెట్ రూ. 5,500 ఉండగా, స్వామిఅమ్మవార్ల వద్ద రుద్రాభిషేకం టికెట్ రూ. ఆరు వేలు చెల్లించిన వారికి ప్రవేశం ఉంటుంది. కాగా,
సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో జ్యతిర్లింగాలలో ఒకటటైన శ్రీకాళహస్తి ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఇక్కడ రాహువు, కేతువు కొలువై ఉండడమే అని పండితులు చెబుతున్నారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలో వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలు తీసుకుని వచ్చే వారి నుంచి రూ. 200 టికెట్ కొనుగోలు చేయించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలక మండలి ఏర్పడిన తరువాత ఈపరిస్థితి ఇలాగే ఉంటుందా? చెల్లుచీటి ఇస్తారా? అనేది వేచిచూడాలి.
ఈ ఆంక్షలు ఏమిటి?
ఆలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు అనుమతించరు. అధికారులు, సిబ్బంది వద్ద ఉంటాయి. దీనిని ప్రశ్నించకూడదని స్థానికులు అంటున్నారు. ఈ విషయం పక్కకు ఉంచితే, గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నుంచి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అంజూరు తారక శ్రీనివాసులు ఉన్నప్పుడు ఆ ఆంక్షలు అమలు చేశారు. ఆ సమయంలో కనీసం గురుదక్షిణామూర్తి విగ్రహం వరకైనా జర్నలిస్టుల సెల్ ఫోన్లు అనుమతించాలని ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. అంటే కంచు గడప దాటిన తరువాత ఎదురుగా 20 అడుగుల సమీపంలో ఆ స్వామి వారి విగ్రహం ఉంటుంది. వీఐపీలు వచ్చిన సమయంలో అక్కడే ఆలయ మర్యాదలతో సత్కరించి, ఆశీర్చనాలు ఇస్తారు. కానీ ప్రస్తుతం అక్కడికి కూడా కెమెరాలు అనుమతించమని ఎమ్మెల్యే పెట్టిన తిర"కాసు" ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు.
Tags:    

Similar News