'ఎన్టీఆర్, పుచ్చలపల్లి'ని అధ్యయనం చేయాలన్న చంద్రబాబు

అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రతిబింబించాలి. అందుకు నిరంతర అధ్యయనం అవసరం అని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధ చేశారు.

Update: 2024-11-12 13:46 GMT
సీఎం ఎన్. చంద్రబాబు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • మంచి ఆలోచనలు సభలో పంచుకోండి. మీకు, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. ప్రజల అభిప్రాయాలు సభలో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధ చేశారు. శాసనసభ ద్వారా తీసుకుని వచ్చే విధానాలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం ఉండాలని చెబుతూ, అసెంబ్లీలో ఎన్టీ రామారావు పుచ్చలపల్లి సుందరయ్య ఏం మాట్లాడారనేది ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. ప్రజలు, సమస్యలు అంటే వైసీపీకి బాధ్యత లేదని సీఎం చంద్రబాబు చురక వేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మొదటి, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంగళవారం బడ్జెట్ పై చర్చించడం ఎలా అనే అంశాలపై అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సభా సాంప్రదాయాలు పాటించి, నిబంధనలను అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా సమయం, సందర్భోచితంగా సమస్యలు ప్రస్తావించడం ద్వారా పరిష్కారానికి సంధానకర్తలుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి వచ్చే వినతులు, అభిప్రాయాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆ ఆలోచనలు సభలో పంచుకుంటే, రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం ఎన్ చంద్రబాబు హితోపదేశం చేశారు.


కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో టిడిపి నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బిజెపి నుంచి నలుగురు, వైసిపి నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నిక అయ్యారని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు ఉంటే అందులో 84 మంది కొత్త వారే ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. రెండోసారి శాసనసభకు ఎన్నికైన వారిలో 30 మంది టీడీపీ నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారని వివరించారు.
విజన్- 2047 సలహాలు ఇవ్వండి
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉంది అని సీఎం చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఇందుకోసం నిర్దేశించుకున్న విజన్ 2047 పై స్పష్టమైన అభిప్రాయాలు తెలియచేయాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. ఈ మిషన్ సఫలం కావడానికి అసెంబ్లీ, శాసనమండలిలో మంచి చర్చ జరిగేందుకు సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు అభిప్రాయాలు పంచుకోవాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు..
పనితనమే ప్రామాణికం
ఎవరికైనా పనితీరే ప్రమాణికం అవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీనికి ఉదాహరణగా ఆయన తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. 1980లో మంత్రి అయ్యాను. "ఇప్పటికి 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా నాలుగు సార్లు సీఎం గా పని చేసే అవకాశం దక్కించుకున్నా" అని వివరించారు. "తన విజయం వెనుక ఉన్నది పనితనం, పార్టీ నిర్మాణం" మాత్రమే అన్నారు. ఏదైనా మన తీరుపై ఆధారపడి ఉందనే విషయాన్ని గ్రహించాలని ఆయన సూచించారు.

కాలం మారింది..

గతంలో శాసనసభ కళా పాలు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో మాత్రమే సమీక్షలు వచ్చేవి అనే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, కొత్త పుంతల ఉతుక్కుతున్న నేపథ్యంలో సామాన్యుడికి కూడా శాసనసభ వ్యవహారాలు తెలుసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. టీవీలలో లైవ్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు సామాన్యుడికి కూడా అందుతుంది అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల అభిమానంతో విజయం సాధించిన ఎమ్మెల్యేలు అందరూ వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలు కాపాడుకుంటూనే, పార్టీ, ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే విధంగా నడత కూడా ఉండాలి. అని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం పెరగడంతో పాటు ఉత్తమ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందడమే కాకుండా సమస్యల పరిష్కారానికి వారధులుగా నిలిచి ప్రజల నుంచి మరింత అభినందనలు అందుకోవచ్చని విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని ఆయన సూచించారు.
అంతా గమనిస్తున్న

గతంలో ఒక అంశంపై ఎంత సమయమైనా చర్చించే వాళ్ళమని గుర్తు చేశారు. రాను రాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలని ఆసక్తి తగ్గుతోంది. ఈ పద్ధతి మార్చుకొని, నిరంతర అధ్యయనంతో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధ చేశారు. సభలో మీరు ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను గమనిస్తున్న. అన్ని పాయింట్లు నోట్ చేసుకుంటున్నా అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు సభలో మరింత జాగ్రత్తగా మసులు కోవాలి. అంశాల ప్రాతిపదికగా చక్కగా మాట్లాడాలి అనే బాధ్యతను గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీలకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహిస్తుంది. మీ నాలెడ్జ్ వినూత్న ఆలోచనలను సభలో పంచుకుంటే తప్పకుండా వినియోగించుకుంటాం. దీని ద్వారా కేంద్ర బడ్జెట్ లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఆ శిక్షణా తరగతులు దోహదం చేస్తాయని ఆయన గుర్తు చేశారు.

వాళ్లకు బాధ్యత లేదు..
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వారి ఆశలను సాకారం చేసే దిశగా మన పనితీరు కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న సభ్యులకు లేదని సీఎం చంద్రబాబు చురకవేశారు. సభలో ప్రతిపక్షం లేదు కదా. ఇంకేముందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. బాధ్యతలనుంచి వైసిపి ఎమ్మెల్యేలు తప్పుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత ఉంది. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది నే విషయాన్ని మరిచిపోవద్దు" అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సభలో బూతు పదం అనేది వినిపించకూడదు. ఇలా వ్యవహరించిన వారి ఏ గతి పట్టిందో ఆలోచన చేయండి అని వైసీపీ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు గుర్తు చేశారు.
Tags:    

Similar News