కూటమి మేనిఫెస్టో వచ్చేసింది.. వారందరిపైన వరాల జల్లు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించామని వారు చెప్పారు.

Update: 2024-04-30 12:33 GMT

ఆంధ్రలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తన మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేసింది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దీనిని ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలు పథకాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేనిఫెస్టో ప్రధానంగా మహిళలు, పింఛన్లపై ఫోకస్ పెట్టినట్లు ఉంది. అంతేకాకుండా ఈ మేనిఫెస్టో ద్వారా కూటమి నేతలు.. మహిళలు, నిరుద్యోగులు, రైతులపై వరాల జల్లు కురిపించారు. వారి అభ్యున్నతి కోసం అన్ని విధాల కృషి చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడితే తొలి సంతకం మెగా డీఎస్‌సీ పైనే పెడతామని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తామని వివరించారు.

 

 

 

 

 రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, దాన్ని ప్రజలకే ఖర్చు చేసే పార్టీ టీడీపీ అయితే.. ప్రజల నుంచి దొరికిందంతా దోచుకుని జేబులు నింపుకునే పార్టీ వైసీపీ అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి అన్న అంశంపై ప్రజలకు ఒక క్లారిటీ ఉందని, దాని ప్రకారమే వాళ్లు ఓట్లు వేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే నేతను ఎన్నుకుంటారని టీడీపీ, జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారు నమ్మకం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

 

Tags:    

Similar News