చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్!
చంద్రబాబుకు సమస్యలు చెప్పుకోవాలనుకునే వారి కోసం టీడీపీ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. కొందరు వల్ల ఇబ్బందులు వస్తున్నందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు పల్లా శ్రీనివాస్.
నేరుగా సీఎంను కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించుకే ప్రక్రియను తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పారు. కాగా సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలని భావించే వారు ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ను సంప్రదించాల్సి ఉంటుందని, ఆ నెంబర్‌కు తమ సమస్యలను వివరించాలని చెప్పారు. ప్రజల సమస్యలను పరిశీలించి వాటిని ప్రాధాన్యత క్రమంలో ఉంచి వారిని సీఎంను కలవడానికి సీఎం వద్దరకు అనుమతిస్తామని ఆయన వివరించారు. సామాజిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న టీడీపీ.. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ చర్యలను కూడా తీసుకుందని చెప్పారు.
అధికారంలోకి రాగానే ఐదు సంతకాలు
అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలపై సంతకం చేసిన మాట నిలబెట్టుకున్ని సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు శ్రీనివాస్. అంతేకాకుండా సంతకాలు పెట్టి చేతులు దులుపుకోలేదని, వాటి అమలు కోసం సత్వర చర్యలు చేపట్టారని, అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆ ఐదు హామాల సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారని అన్నారు.
గొప్ప బాధ్యతగా భావిస్తున్నా
‘‘రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఎలక్షన్‌కు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వేంటనే చంద్రబాబు అమలుచేస్తున్నారు. ఒకే విడతలో పింఛన్ రూ.1000 పెంచిన ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు. మేని ఫెస్టో హామీ ప్రకారం చంద్రబాబు.. పింఛన్‌ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నెల నుండి పెంచిన దానిని జత చేసి జులై 1న రూ.7 వేలు ఇవ్వడం దేశంలోనే రికార్డు. జగన్ ఖజానాను లూటీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే... పేదల పెన్నిది చంద్రన్న వృద్ధులకు రూ.7 వేల పింఛన్ ఇస్తున్నారు. జగన్ విడతల వారి చేయడం వలన ఒక్కొక్క పింఛన్ దారుడు రూ.32వేలు నష్టపోయారు’’ అని వివరించారు.
‘‘జూలై 1వ తేదీన మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రమంలో సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే వారివారి నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం కావాలి. శవ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో అవ్వాతాతలను ఎండల్లో తిప్పి 34 మంది మరణాలకు కారణమైయ్యారు జగన్. పేదల కడుపు నింపడానికి అన్నక్యాంటీన్లను పునరుద్దరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వాటితో పాటుగా నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీని కూడా ప్రకటించారు’’ అని గుర్తు చేశారు.
రాష్ట్రానికి రూ.70వేల కోట్ల నష్టం
‘‘రివర్స్ టెండర్ పేరుతో పోలవరంపై వైసీపీ చేసిన విధ్వంసంలో రూ.70 వేల కోట్లు నష్టపోయాం. పక్క రాష్ట్రల ప్రయోజనాల కోసం పోలవరాన్ని గోదాట్లో ముంచిన ఘనత మాజీ సీఎం జగన్ రెడ్డిదే. త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తాం. అమరావతిని ఒక కులానికి అంటగట్టి విశాఖ రాజధాని పేరుతో దోచుకుని అమరావతిని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. అమరావతని పూర్తి చేసి ప్రపంచంలో మేటైన రాజధానిగా తీర్చుదిద్దుతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం’’ అని భరోసా ఇచ్చారు.
పార్టీ ఆఫీసుకు అందకు వస్తేనే మేలు
‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు బీసీ వర్గానికి వన్నె తెచ్చేలా ముందుకు వెళ్తా. చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెడతా. సీఎంను కలిసేందుకు ఎక్కువ మంది ప్రజలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. దీంతో సమస్యలపై వస్తున్న ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. వీరికి ఇబ్బంది కలుగకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే వారికి ప్రాధాన్యత కల్పించి సీఎంను కలిచే ఏర్పాటు చేస్తాం. నెంబర్ 7306299999 కు కాల్ చేయాలి. 500 మంది గ్రివెన్స్‌కు హాజరయ్యేలా ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వేస్తే మేలు. ఫోటోలు తీసుకోవడానికి వస్తున్న యువత, జనం వల్ల సమస్యలు కోసం వస్తున్న వారు కొందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే గ్రీవెన్స్‌ను సక్రమంగా నిర్వహించేందుకు టోల్ నెంబర్ పెడుతున్నాం’’ అని వివరించారు.