CM family in Naravaripalle| 'నారా'వారిపల్లెలో 'కోడళ్ల సంక్రాంతి సందడి'

స్వగ్రామంలో నారా కుటుంబం కలిసిపోయింది. భువనేశ్వరి సారధ్యంలో జరిగిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రేక్షకుడయ్యారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-13 12:09 GMT
వేదికపై భార్య భువనేశ్వరితో సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి సీఎం కావచ్చు. నేను నారావారిపల్లె గ్రామస్తుడినే నిరూపించుకున్నారు. గ్రామస్తులతో కలిసి పోయారు. పెద్దలతో సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి, గ్రామ పిల్లలతో మంత్రి లోకేష్ భార్య బ్రహ్మణి, కొడుకు దేవాన్ష్ మట్టిలోనే ఆటలాడుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ భువనేశ్వరి సారధ్యంలోనే సాగాయి. ఏర్పాట్లు కూడా అలాగే చేశారు. మహిళలకు భువనేశ్వరి, బ్రహ్మణి పోటీలు నిర్వహించి, నగదు బహుమతులు అందించారు. నారా లోకేష్ భార్య బ్రహ్మణి కొడుకు, చెల్లెలు పిల్లలను గ్రామంలోని చిన్నారులతో కలిపారు. ఈసారి నారా కుటుంబం సెక్యూరిటీని పక్కకు ఉంచి, తమతో పూర్తిగా కలిసిపోవడంతో గ్రామస్తులు తెగ సంబరపడి పోయారు. గ్రామంలోని పిల్లలతో కూడా ఏమాత్రం అరమరికలు లేకుండా సరదాగా ఆటలాడుకున్నారు.


సంక్రాంతి సంబరాలు సొంత ఊరు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబీకులతో కలిసి ఏటా సంబరాలు జరుపుకోవడం ఓ ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహం నింపడమే కాదు. ఆటపాటలు, క్రీడా పోటీలతో ఉత్సాహం నింపారు. నారా వారి కోడళ్లు భువనేశ్వరి, బ్రహ్మణి, పిల్లలు గ్రామస్తులతో కలిసి పల్లె క్రీడల్లో పాల్గొనడం ఈసారి ప్రత్యేకంగా కనిపించింది.

సంక్రాంతికి ఒకరోజు ముందు సీఎ చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్, లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, కూతుళ్లు, మనవళ్లతో పాటు నందమూరి రామకృష్ణ, నారావారిపల్లెకు చేరుకున్నారు.
బాబుది ప్రేక్షకపాత్రే

నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ నారా భువనేశ్వరి సారధ్యంలోనే సాగాయి. ఈ ఊరి కోడలిగా నేను చేయాల్సిన పనులు ఇంటికోసం, గ్రామ ప్రజల కోసం చేస్తా అన్నట్లుగానే అన్నీ తానే అయి వ్యవహరించారు. ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి అత్తాకోడలు భువనేశ్వరి, బ్రహ్మణి మాటలు, చేతల్లో సాగుతుంటే, సీఎం చంద్రబాబు మాత్రం చప్పట్లు కొడుతూ ప్రోత్సాహించిన ఆయన తనది ప్రేక్షకపాత్రే అన్నట్లు వారిని అనుసరించారు. సోమవారం ఉదయం భోగి పండుగతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఇంటి నుంచి వారందరూ బయలుదేరి సమీపంలోని ప్రాంగణంలోకి వచ్చారు. గ్రామస్తులను ఉద్దేశించి మొదట బ్రహ్మణి మాట్లాడారు.
"నేను ఈ ఊరి కోడలినే. మీ అందరితో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీ అందరితో కలిసే ఉంటాం" అని చెప్పడంతో గ్రామస్తులు సంబర పడిపోయారు.
"మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాం. 120 మంది ఉత్సాహంగా ముగ్గులు వేశారు" వారిలో విజేతలుగా నిర్ణయించడం కష్టంగా మారిందని బ్రాహ్మణితో పాటు నారా భువనేశ్వరి కూడా వ్యాఖ్యానించారు.

"విజేతలందరికీ బహుమతులు అదిస్తా" అని భువనేశ్వరి చెప్పారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ఒక్కొక్కరికి రూ.10,116 నగదు బహుమతులు ఇంటికి పంపిస్తా అని చెప్పారు. అప్పుడు కూడా భార్య భువనేశ్వరి వైపు చూస్తూ చంద్రబాబు చప్పట్లతో స్వాగతించారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు, బామర్ది నందమూరి రామకృష్ణ, కొడుకు నారా లోకేష్, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి కూర్చొన్నారు. కుడిపక్క భార్య భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, బ్రహ్మణి, తేజస్విణి, పిల్లలతో కలిసి కూర్చుంటే, వెనుక నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ తోపాటు బంధువులు కూర్చొన్నారు.
పిల్లలతో దేవాన్హ్ సందడి

విశాలమైన క్రీడామైదానంలో గ్రామస్తులతో నారా, నందమూరి కుటుంబీకులు కూడా క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. పిల్లలకు మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, గన్నీబ్యాగ్, రేస్ లెమన్, పొటాట గ్యాదరింగ్, వంటి పోటీలు నిర్వహించారు. ఈ రాజకీయాల నుంచి పూర్తి ఆటవిడుపు అన్నట్లు నారా కుటుంబం పిల్లల క్రీడాపోటీలు చూస్తూ ఆనందించారు. పోటీలు ఆసక్తికరంగా మారడానికి పెద్దలు పిల్లలను మరింతగా ప్రోత్సహించారు.
మ్యూజికల్ చైర్ ఆడించడానికి కొడుకు దేవాన్హ్ ను బ్రహ్మణి ప్రోత్సాహించారు. గ్రామంలోని పిల్లలకు పరిచయం చేయడంతో పాటు వారిలోనే ఒకడిగా వదిలేశారు. గ్రామంలోని పిల్లలు చెప్ప మాటలు వింటరూ, పల్లె మాటలను దేవాన్హ్ ఆస్వాదిస్తుంటే, సీఎం మనవడు మాతో కూర్చున్నాడనేది కాకుండా పిల్లలు దేవాన్ష్ చెప్ప మాటలు, ఆసక్తి కథనాలు వినడానికి కూడా ఆసక్తిగా కనిపించింది. ఈ సమయంలో కూడా బ్రహ్మణి దూరంగా నిలబడే, ఊరి పిల్లలతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రోత్సాహించారు.
లోకేష్ స్థానంలో కొడుకు
వివాహానికి ముందు కూడా తల్లిదండ్రులతో కలిసి నారావారిపల్లెకు వచ్చిన సందర్భాల్లో నారా లోకేష్ ఉత్సాహంగా గడిపే వాడు. గ్రామంలోని యువకులతో క్రికెట్ ఆడడం, కబడ్డీ పోటీల్లో తలపడే సందర్భాలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అవన్నీ చూడుకన్నా బ్రహ్మణి కూడా కొడుకు దేవాన్ష్ ను గ్రామంలోని పిల్లలతో కలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఢిల్లీకి రాజు అయినా సరే. తల్లికి కొడుకే అనే మాటలను నారా కుటుంబం సార్థకం చేసే రీతిలో గ్రామంలో మాది ఓ కుటుంబమే అన్నట్లు వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. ఇంకా రెండు రోజుల పాటు నారావారిపల్లె సంబరాలతో సందడిగా మారనుంది. ఊరిలోకి వచ్చిన నారా చంద్రబాబు కుటుంబీకులతో గ్రామంలోని మహిళలు రోజు వారి పొలం పనులకు ఎలా వెళతారో, అదే పద్ధతిలో నెత్తిన తట్టలు పెట్టుకుని వచ్చారు. వారికి హారతులతో స్వాగతం పలికారు.






Tags:    

Similar News