'ఈ సంకల్పం' వెనక లక్ష్యం ఏమిటంటే..
రాష్ట్ర ప్రభుత్వం "మిషన్ పాట్ హోల్ ఫ్రీ" చేపట్టింది. సీఎం కర్తవ్యం ఏమిటి? సంక్రాంతి నాటికి ఏమిచేస్తారంటే..
ఏ పనిచేయలన్నా సంకల్పం, లక్ష్యం ఉండాలి. ఆచరణ ముఖ్యం అనేది సీఎం చంద్రబాబు ఉద్బోధ. వ్యక్తిత్త వికాసాన్ని బోధించడం సీఎం చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణం. ఇందులో ఆయన మించిన వారెవరూ ఉండరేమో. అంతేకాదు, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో కూడా తెలుగుదేశం శైలి విభిన్నంగా ఉంటుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు నుంచి ఆ లక్షణాలను సీఎం చంద్రబాబు కూడా అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తుంది. కోవలో తాజాగా..
రాష్ట్రంలో "మిషన్ పాట్ హోల్ ఫ్రీ" కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శనివారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మిషన్ కోసం ప్రభుత్వం 860 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇదే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా అనుసరించారు. ఆ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఒక్కటే అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. "రాష్ట్రంలో గుంతల లేని రోడ్లు ఏర్పాటు చేయాలి" అనేదే ప్రధాన కర్తవ్యం అని ప్రకటించారు. ఉద్యమంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో శంకుస్ధాపన చేశారు.
పార చేతపట్టి..
సీఎం చంద్రబాబు సంకల్పాన్ని మంత్రులు కూడా అందిపుచ్చుకున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ కూటమిలోని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ అనుసరించారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేశారు. పలుగు, పారకు కూడా పూజల అనంతరం ధర్మవరంలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ.2.90 కోట్ల రూపాయలు కేటాయించారని సత్యకుమార్ తెలిపారు.