సుప్రీం కోర్టులో ప్రారంభమైన విచారణ.. ఇండిపెంటెండ్‌ ఇన్విస్టిగేషన్‌ దిశగా అడుగులు

సీబీఐకి ఇచ్చే దిశగా చర్చలు. సుప్రీం కోర్టులో లడ్డూ విచారణ ప్రారంభమైంది. ఇరు పక్షాల పట్ల న్యాయవాదులు బలమైన వాదనలు వినిపిస్తున్నారు.

Byline :  The Federal
Update: 2024-10-04 05:35 GMT

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై నేడు విచారణ మొదలైంది. తొలి కేసుగా లడ్డూ కేసునే విచారణకు చేపట్టింది. జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణను ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది లద్ధార్థ్‌ లూథ్రా టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్‌లపై విచారణ జరుగుతోంది. సిట్‌ విచారణ జరపాలని లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి పిటీషన్‌పై ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపున ముకుల్‌

ఇండిపెండెంట్‌ దర్యాప్తు దిశగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్వతంత్ర దర్యాప్తు దశగానే ఆలోచనలు చేస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు చేస్తోంది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది. సీబీఐ పర్యవేక్షణ చేయనుంది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో దర్యాప్తు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను నిలిపివేసే చాన్స్‌ ఉంది.


Tags:    

Similar News