ఏపీలో దొంగ పెన్షనర్లు 3.20లక్షల మంది

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు పెన్షనర్లను దొంగలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-20 06:46 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిని దొంగలు అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. విశాఖటప్నంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 3.20లక్షల మంది దొంగ పెన్షనర్‌లు ఉన్నారని, వీరిని తొలగించాల్సిందేనని అన్నారు. ఈ దొంగ పెన్షనర్‌ల వల్ల ప్రభుత్వానికి పెద్ద నష్టం కలుగుతోందన్నారు. ఈ దొంగ పెన్షన్ల కోసం నెలకు రూ. 120 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వస్తోందని, ఏడాదికి రూ. 1440 కోట్లు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ఎవరు ఏమనుకున్నా తనకు అవసరం లేదని.. ఈ దొంగ పెన్షన్లను తొలగించాల్సిందేనని సంచలన వాఖ్యలు చేశారు.

Tags:    

Similar News