జరిమానాలు విధిస్తేనే వాహనాదారుల్లో భయం ఉంటుంది

నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై జరిమానాలు విధించాలి. కట్టకపోతే అలాంటి వాహనాలను సీజ్‌ చేయాలి.

Update: 2024-12-19 06:07 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు సీరియస్‌ అయ్యింది. మోటారు వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే వాహన దారుల్లో భయం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించిన వారిపై స్పాట్‌లోనే జరిమానాలు విధించాలని పేర్కొంది. అలా చేసినప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వాహనదారులపై సీరియస్‌ అయ్యింది. అంతేకాకుండా రోడ్లపైన తనిఖీలు చేయడంతో పాటుగా పోలీసులు రోడ్లపై ఉంటే వాహనదారులు నిబంధనలు అతిక్రమించేందుకు వెనకడుగు వేస్తారని వ్యాఖ్యానించింది. మోటారు వాహన చట్టం అమలు, రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు సంబంధిత ట్రాఫిక్‌ ఐజీ హాజరు కావలసి ఉంటుంది. ఈ సారి ట్రాఫిక్‌ ఐజీ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మోటారు వాహన చట్టం సరిగా అమలు కావడం లేదని, నిబందనలు పాటించడం లేదని, దీంతో ప్రామాదాలు జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోందని పేర్కొంటూ తాండవ యోగేష్‌ అనే న్యాయవాది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అటు పోలీసులపై, ఇటు వాహనదారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు సక్రమంగా అదమలు చేస్తే మంచి మార్పులు వస్తాయని హై కోర్టు పేర్కొంది. ఎలా అమలు చేయాలో కూడా సూచనలు చేసింది. మోటారు వాహన చట్టం నిబందనలు, రోడ్డు ప్రమాదాలు, నష్టాలు వంటి అంశాలపైన ముందుగా ప్రజలను చైతన్యం తీసుకొని రావాలి. దీని కోసం సదస్సులు నిర్వహించాలి. పత్రికలు, టీవీలు, ఎఫ్‌ఎం రేడియోలు, అడ్వటైజ్‌మెంట్‌ బోర్డులు, సినిమా హాళ్లల్లో ప్రకటనలు ఇవ్వాలని అధికారులను, ట్రాఫిక్‌ విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది. మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై జరిమానాలు విధించాలి. కట్టకపోతే అలాంటి వాహనాలను సీజ్‌ చేయాలని హై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

Tags:    

Similar News