ఏపీ సీఎం కార్యదర్శులకు కేటాయించిన శాఖలివే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు శాఖలు కేటాయించారు. ఒక్కో కార్యదర్శికి 10 శాఖల చొప్పున కేటాయించారు.

Byline :  The Federal
Update: 2024-07-20 12:51 GMT

ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుకు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కలిపి నలుగురు అధికారులు ఉన్నారు. ముద్దాడ రవిచంద్ర ముఖ్య కార్యదర్శిగాను, వి రాజమౌళి కార్యదర్శిగాను, పిఎస్‌ ప్రద్యుమ్న కార్యదర్శిగాను, కార్తికేయ మిశ్ర అదనపు కార్యదర్శిగాను ఉన్నారు.

సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు
1. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్, లా అండ్‌ ఆర్డర్, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
2. హోమ్‌ అఫైర్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
3. ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్‌ ట్యాక్సెస్, లెజిస్లేటివ్‌ వ్యవహారాలు
4. రెవిన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌
5. ఎక్సైజ్‌
6. ఎండోమెంట్‌ శాఖ
7. లా అండ్‌ జస్టిస్‌
8. హెల్త్, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌
9. చీఫ్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, ఢిల్లీ, విదేశీ పర్యటనలు
10. సీఎం వ్యవహారాలకు సంబంధించిన ఓవరాల్‌ కోఆర్డినేషన్‌ వంటి బాధ్యతలు అప్పగించారు.
సీఎం కార్యదర్శి రాజమౌళికి పది శాఖల బాధ్యతలు అప్పగించారు.
1. వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌
2. మైన్స్‌ అండ్‌ జియాలజీ
3. ఎనర్జీ
4. అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్‌
5. పశుసంవర్థక శాఖ, డైరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్‌
6. సాంఘీక సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమం, సచివాలయాలు, విలేజ్‌ వలంటీర్ల వ్యవస్థ
7. మైనారిటీ వెల్ఫేర్‌
8. బీసీ వెల్ఫేర్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్‌ లూమ్స్, టెక్స్‌టైల్స్‌
9. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌)
10. ముఖ్యమంత్రి గ్రీవెన్సెస్‌ మోనటరింగ్‌
మరో సీఎం కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్నకు మరో పది విభాగాలు కేటాయించారు.
1. హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌
2. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్‌టీజీఎస్‌)
3. పురపాలక, పట్టణాభివృద్ధి
4. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
5. రవాణా, రోడ్లు, భవనాలు
6. ఫుడ్, పౌరసరఫరాలు, వినియోగ దారుల సేవలు
7. గృహ నిర్మాణం
8. స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ వ్యవహారాలు
9. గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ)
10. యువజన, క్రీడలు
మరో సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రకు పది విభాగాలు కేటాయించారు.
1. ఇన్‌ఫర్మేషన్‌ టెక్సాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌
2. ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ రిలేషన్స్‌
3. సమాచార, పౌరసంబంధాల విభాగం
4. టూరిజమ్, కల్చర్, సినిమాటోగ్రఫీ
5. మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు
6. పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌
7. లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌
8. ఎంఎస్‌ఎంఈ
9. ఫైనాన్స్‌(ఐఎఫ్‌)
10. ముఖ్యమంత్రి ఢిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం
Tags:    

Similar News