టీడీపీ మొదటి జాబితా క్యాండిడేట్స్‌ వీరే

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై మొదటి విడత కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు పేర్లు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.;

Byline :  The Federal
Update: 2024-01-09 01:54 GMT
TELUGUDESAM PARTY FLOG

తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా దాదాపు ఖరారైంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ముందుగా అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను ఈనెలాఖరులోపులోనే ప్రకటించాలనే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. ఇప్పటికే సుమారు 100 మంది అభ్యర్థుల జాబితా రెడీ అయినప్పటికీ మొదటి విడతగా సుమారు 66 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీట్లలో జనసేన పార్టీకి పొత్తులో టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులకు పొత్తులో సీటు దక్కకుండా పోతే పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావించి మొదటి విడత జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ జాబితాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. విశ్వసనీయ సమాచారం మేరుకు తొలి జాబితా ఈ విధంగా ఉంది.

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్‌
టెక్కలి – అచ్చెనాయుడు
ఆముదాలవలస – కూన రవికుమార్‌
పలాస – గౌతు శిరీష
రాజాం – కొండ్రు మురళీ మోహన్‌
బొబ్బిలి – బేబీ నాయన
విజయనగరం – అశోక్‌ గజపతి రాజు
చీపురుపల్లి – కిమిడి నాగర్జున
కురుపాం – టి జగదీశ్వరి
పార్వతీపురం – బి విజయచంద్ర
వైజాగ్‌ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు
వైజాగ్‌ (పశ్చిమ) – గణబాబు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
నర్సీపట్నం – చింతకాయల విజయ్‌
తుని– యనమల దివ్య
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
అనపర్తి –నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రాజమండ్రి (అర్బన్‌) – ఆదిరెడ్డి వాసు
గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు
ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు
అమలాపురం – బత్తుల ఆనందరావు
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
దెందులూరు –చింతమనేని ప్రభాకర్‌
విజయవాడ ఈస్ట్‌– గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ (సెంట్రల్‌) – బోండా ఉమ
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్‌ తాతయ్య
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
పెనమలూరు–బోడె ప్రసాద్‌
మంగళగిరి–నారా లోకేష్‌
పొన్నూరు–ధూళిపాళ్ల నరేంద్ర
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ
వినుకొండ – జివి ఆంజనేయులు
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
వేమూరు – నక్కా ఆనందబాబు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
ఒంగోలు – దామచర్ల జనార్దన్‌
కొండపి – డాక్టర్‌ శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి
కోవూరు – పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు రూరల్‌ –కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌ రెడ్డి
నగిరి – గాలి భానుప్రకాష్‌
పలమనేరు – అమర్‌నాథ్‌ రెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి
జమ్మలమడుగు – భూపేష్‌ రెడ్డి
మైదుకూరు–పుట్టా సుధాకర్‌
పులివెందుల–బీటెక్‌ రవి
బనగానిపల్లి – బీసీ జనార్దన్‌ రెడ్డి
పాణ్యం – గౌరు చరితారెడ్డి
కర్నూలు – టీజీ భరత్‌
ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
ఉరవకొండ – పయ్యావుల కేశవ్‌
తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి
కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు
హిందూపూర్‌ – నందమూరి బాలకృష్ణ
కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌
Tags:    

Similar News