జగన్‌ సర్కార్‌ అవినీతి నుంచి వచ్చిందే ఈ డ్రగ్స్‌ సమస్య

కూటమి ప్రభుత్వం ఏ విమర్శలు చేసినా, దానికి గత ప్రభుత్వ పాలనను ముడిబెట్టడం పరిపాటిగా మారింది. డ్రగ్స్‌ సమస్య కూడా ఆ ప్రభుత్వ అవినీతి వల్లే వచ్చిందన్నపవన్ కళ్యాణ్

Update: 2024-11-09 07:40 GMT

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మరో సారి జగన్‌ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెనుముప్పుగా మారిన గంజాయి, డ్రగ్స్‌ సమస్యలను జగన్‌ ప్రభుత్వానికి ముడిపెట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌ ప్రభుత్వం వల్లే ఈ సమస్య వచ్చిందని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి సమస్యలు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంక్రమించిన వారసత్వ సమ్యగా పవన్‌ కళ్యాణ్‌ అభివర్ణించారు. దీనిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రత్యేక దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. గతంలో విశాఖ పోర్టులో కొకైన మాదక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున్న స్వాధీనం చేసుకున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశంలో ఏ ప్రాంతంలో డ్రగ్స్‌ పట్టుబడినా, వాటికి ఆంధ్రప్రదేశ్‌కు లింక్‌ ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలున్నాయనే అంశాలు అప్పుడు వెలుగులోకి వచ్చాయనే అంశాన్ని కూడా వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి నేరస్తులను కట్టడి చేసేందుకు ఒక సమగ్రమైన యాక్షన్‌ ప్లాన్‌ అవసరమని, దీనిని రూపొందించి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూటమి ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఆ మేరకు ఆయన శనిరవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Tags:    

Similar News