Central Schools | 'సీమలో కేంద్రీయ చదువు'లకు ప్రాధాన్యం

రాయలసీమ మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. దీనిద్వారా పేదపిల్లల విద్యకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-12-07 04:31 GMT
సెంట్రల్ స్కూల్

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర మొత్తం మీద ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు (Central Schools) మంజూరు చేస్తూ కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పాఠశాలల్లో మూడింటిని రాయలసీమలోని మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి వెసులుబాటు కల్పించింది. 2025- 26 వ విద్యా సంవత్సరం నుంచి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి కూడా అనుమతి లభించింది.

కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం అంటే, పేదల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి తీసుకురావడమే. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది .
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా) మదనపల్లి సమీపంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానుంది. వలసపల్లె సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రీయ విద్యాలయంలో రానున్న విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. విభజిత అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇప్పటికే కేంద్రీయ విద్యాలయం ఉంది.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో రెండు కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చినట్లయింది.
రాయలసీమలో మూడు పాఠశాలలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ పాఠశాలలు మంజూరు చేసింది. అందులో రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఒకటి, ఉమ్మడి అనంతపురం జిల్లా (శ్రీసత్యసాయి జిల్లా) గోరంట్ల మండలం పాలసముద్రం, ఉమ్మడి కర్నూలు జిల్లా (నంద్యాల జిల్లా) డోన్ (ద్రోణాచలం)లో కేంద్రీయ పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడంలో టీడీపీ కూటమి ఎంపిల ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. మిగతా ఐదు పాఠశాలలు అనకాపల్లి, గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి, పల్నాడు జిల్లా రొంపిచర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడులో పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలో ప్రయత్నం..
ఐదదేళ్ల తరువాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రయత్నం ఫలించినట్లు కనిపిస్తోంది. మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం కోసం వైసీపీ అధికారంలో ఉండగా ప్రయత్నాలు జరిగాయి. కేంద్రంలోని ఆనాటి బీజేపీకి వైసీపీ సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రీయ విద్యాలయం సాధించడంలో వైఫలం చెందారు.
అధికారంలో ఉండగా చొరవ తీసుకున్నరాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లె వద్ద ఐదెకరాలు కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించారు. ఎంపీ కోటా నిధుల నుంచి రూ. 40 లక్షలతో భవనాలు కూడా నిర్మించారు. ఆ తరువాత కేంద్ర బృందం కూడా పరిశీలన చేసింది. మినహా పాఠశాల ఏర్పాటుకు క్యాబినెట్ నుంచి అనుమతి లభించలేదు. కాగా, ప్రస్తుతం మిగతా ప్రాంతాలతో పాటు మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ, నిర్ణయం తీసుకోవడంపై ఎంపీ మిథున్ రెడ్డి సోషల్ మీడియా హర్షం వ్యక్తం చేశారు.
చదువు, ఉద్యోగాలు..
రాష్ట్రంలో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, వందలాది మందికి ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. రాష్ట్రంలో ఎనిమిది కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటుకు రూ. 5,872 కోట్లు ఖర్చు అవుతుందనేది కేంద్ర ప్రభుత్వ అంచనా. ఒకో పాఠశాలలో 960 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తే, 7,680 మందికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఒకోొ పాఠశాలలో 63 మందికి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ఆ లెక్కన రాష్ట్రంలోని 504 మందికి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ద్వారా ఉద్యోగాలు కూడా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వ అంచనా.
Tags:    

Similar News