తిరుపతిలో కడుపు మండిన పేదలు ఏం చేశారంటే...

రాజకీయనాయకులంతా కనిపించిన కొండను గుట్టను నున్నగా తవ్వేసి, భూములను కబ్జా చేసుకుంటుంటే ఇళ్లు లేని పేద ప్రజలు ఈ రోజు పోలో మని ఆగట్టులను ఆక్రమించారు ఇలా...;

Update: 2024-02-04 14:12 GMT

తిరుపతి నగరంలో ఇళ్ల స్థలాల కోసం  పేద ప్రజలు దండు కట్టారు.

వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలకు ముఖ్యద్వారమయిన తిరుపతి  నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కరకంబాడి ప్రాంతమంతా ఈ రోజు కోలాహాలంగా మారిపోయింది. జాతరను తలదన్నేట్టుగా జనం ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా కనిపిస్తున్నారు. పాత చీరెలతో గుడారాలు వేసుకుంటున్నారు. తమకు ఇల్లు కట్టుకునేందుకు జానెడ జాగకోసం వాళ్లు ఇక్కడికి దండయాత్ర చేశారు.


 

 కారణం: తిరుపతిలో దేవుడికంటే రాజకీయ నాయకులే పవర్ ఫుల్. వాళ్లు అనుకుంటే పనులువుతాయి. వాళ్లు అనుకుంటే కొండలు, గుట్టలు మాయమవుతాయి. మైన్లు వస్తాయి.ఇలాంటి బడా రాజకీయనాయకుల, వాళ్ల ఏజంట్ల కళ్లు కరకంబాడి గ్రామ పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూముల మీద పడ్డాయి.




 తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుుతున్న భారతీయనగరాల్లో ఒకటి. తిరుమలకు వెళ్లే వాళ్లతో ఎపుడూ క్రిక్కిరిసి ఉండే నగరం. అందువల్ల నగరం విస్తరిస్తూ ఉంది. దీనితో నగరం చుట్టూపక్కల ఉన్న ప్రభుత్వ భూములను కాజేయేడం ఎక్కువయింది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు కళ్లు ఇపుడు కరకంబాడి వెయ్యెకరాలమీద పడ్డాయి. అక్కడున్న గుట్టలను తవ్వేశారు. ఇక భూములన ఏదో ఒక సాకుతో కబ్జా చేయడమే మిగిలింది.




కరకం బాడీ భూముల్లో మైనింగ్ కార్యక్రమాలు అక్రమంగా జోరుగా జరుగుతున్నాయి. కొండలను సైతం తవ్వేసి పూర్తిగా ఆక్రమించి దందా చేస్తున్నారు పెద్దలు... రెవెన్యూ వారు ఇటువైపు  చూడనే చూడటడం లేదు.

 అందువల్ల రాజకీయ నాయకులు కబ్జా చేయకముందే పేదలు మేల్కొన్నారు.  వారం రోజుల నుంచి తిరుపతి నగరం, కరకంబాడి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేదలు పెద్ద సంఖ్యలో పోగై గుట్ట స్థలాన్ని ఆక్రమించారు. ఆఖరికి కొండపైకి సైతం వెళ్లి చీరలు దారాలు, ప్లాస్టిక్ గోతాలతో హద్దులను ఏర్పాటు చేసుకొన్నారు.  


వీరిలో అర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని  సిపిఎం నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళిలు కోరుతున్నారు.
ఈరోజు ఉదయం జరిగిన పేదల జనరల్ బాడీలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూడా పెద్ద ఎత్తున భూదందా జరిగిందని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పెద్దలు భోంచేసారని వారు అన్నారు

ఇళ్ల స్థలాల్లేని మనుషులే లేరంటుంది ప్రభుత్వం



 


రాష్ట్ర ంలో ఇళ్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రభుత్వం  ప్రకటించడం పట్ల సిపిఎం నేత కందారపు మురళి  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్ధం సభలో మాట్లాడుతూ ఇంటి స్థలం లేని పేదవారిని ఒక్కరిని చూపిస్తే బహుమతి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనని గుర్తు చేస్తూ వీళ్లంతా ఎవరో జిల్లాలో ఉన్న వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు చెప్పాలని ఆయన అన్నారు. కరకం బాడి అడివిలోకి, ఎలాంటి వసతులు లేని కొండగుట్టల్లోకి వచ్చి ప్రజులు ఇల్లు కట్టుకునేందుకు సిద్దమవుతున్నారంటే, ఇంటి అవసరం ఎంత ఉందో చూడాలని ఆయన అన్నారు.


Similar News