కూటమిలో స్పీడందుకోని ప్రచారం

అభ్యర్థుల ఎంపికలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటించి కథన రంగంలోకి ఎప్పుడు దిగుతారోనని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Update: 2024-03-22 14:56 GMT
అమిత్ సా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

జి. విజయ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లోని 175అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దూసుకొని పోతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఇంకా నిమగ్నమైంది. శుక్రవారం చంద్రబాబు మూడో జాబితాగా కొందరు అభ్యర్థులను పార్టీ కార్యాలయం కేంద్రంగా ప్రకటించారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు. పొత్తుల్లో వచ్చిన చిక్కులో, అభ్యర్థులను ఖరారు చేయడంలో వచ్చిన చిక్కులో కానీ ఇలా ఉంది పరిస్థితి. ఇలాగే ఉంటే ప్రచారంలో జోష్‌ తగ్గినట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కసారిగా ప్రకటించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌
గత డిసెంబరు నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయ కర్తల నియామకాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చేపట్టారు. అప్పటి నుంచి మార్చి రెండో వారం వరకు పేర్లను ప్రకటిస్తూ వచ్చారు. సుమారు 12 జాబితాలను విడుదల చేశారు. ఈ జాబితాలను ప్రకటిస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు, ఆశావాహులు, సిట్టింగ్‌ ఇన్‌చార్జీల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. తమ పేర్లు ఉంటాయో ఉండవోనని మానసిక ఆందోనలకు గురయ్యారు. అయితే వీటికి ముగింపు పలుకుతూ వారం రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ వేదికగా 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 25 పార్లమెంట్‌ నియోజక వర్గాలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. రాని వాళ్లు బాధపడగా, వచ్చిన వాళ్లు ఎగిరి గంతేశారు. ఏదేమైనా ఒక్క సారిగా అభ్యర్థుల ప్రకటనతో నేతల్లో నెలకొన్న ఉత్కంఠకు సీఎం వైఎస్‌ జగన్‌ తెర దించారు. ఒక్కసారిగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు తాను సిద్ధమని మరో సారి చూపించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని అభ్యర్థులు, నాయకులు, ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేసేశారు. ఇప్పుడు కేవలం ప్రచారంపైనే దృష్టి సారించారు. దాని కోసం వ్యూహాలు పన్నుతూ ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో బస్‌ యాత్ర ద్వారా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు.
సాగదీస్తోన్న టీడీపీ, జనసేన, బిజెపి కూటమి
ఒక వైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఫోర్త్‌ గేర్‌ హైస్పీడ్‌లో వెళ్తోంటే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నేతలు, కార్యకర్తల్లో బేజారు పుట్టిస్తున్నారు. అభ్యర్థుల ఖరారును ఇంకా సాగదీయడం, దాదాపు నెల రోజుల పాటు పొత్తుల కోసం మంతనాలు జరపడంతోనే సరిపుచ్చారు. డిసెంబరులో మొదలైన ఈ ప్రక్రియ మార్చిలో కొలిక్కి వచ్చింది. బిజెపి, జనసేనలకు కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్‌ స్థానాలను కేటాంచారు. వీటిల్లో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్‌ స్థానాలు బిజెపీకి, 21 అసెంబ్లీ, 2 ఎంపి స్థానాలు జనసేనకు కేటాయించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక పక్క పొత్తులు ఖరారైనా అభ్యర్థులను ప్రకటించకపోడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రచారానికి ఎప్పుడు సన్నద్ధం కావాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా శుక్రవారం మూడో జాబితాను ప్రకటించారు. ఇది వరకు 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపి స్థానాల పేర్లను వెల్లడించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపి స్థానాలను ఖరారు చేయMýంండా పెండింగ్‌లో పెట్టారు. జనసేన ఇప్పటి వరకు ఐదు స్థానాల అభ్యర్థులనే ప్రకటించింది. ఇటీవల ఒక ఎంపిని ప్రకటించింది. దీనిలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. అసరమైతే తానే ఎంపిగా పోటీ చేసే చాన్స్‌ ఉందని కూడా పవన్‌ కల్యాణ్‌ చెప్పడం గమనార్హం. ఇక బిజెపీ అయితే ఖాతానే తెరవ లేదు. ప్రచారంలో ఉమ్మడి సభలు, సమావేశాలు స్పీడుగా ముందుకు సాగటం లేదనే విమర్శ పార్టీ వర్గాల్లో ఉంది. కూటమిగా ఏర్పడి ఇన్ని రోజులైనా ఒకటీ రెండు సభలతోనే సరిపెట్టారు. ఇకపై నిత్యం సభలు, సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు టిడీపీ, జనసేన, బీజేపీ నేతలను కోరుతున్నారు.
Tags:    

Similar News