వంశీకి రిమాండ్ పొడిగింపు
మూడు అంశాల మీద కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.;
By : The Federal
Update: 2025-03-03 12:09 GMT
విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై వర్చువల్ విధానంలో విచారణ జరిపిన కోర్డు వల్లభనేని వంశీని విచారించింది. మూడు అంశాల మీద కోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఈ నెల 17 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
విజయవాడ జైల్లో ఉన్న వంశీ తన బ్యారక్‌ను మార్చాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ మీద విచారణ జరగాల్సి ఉండగా మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను వెనక్కు తీసుకుంది. దీంతో తాజాగా సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ మీద విచారణ చేపట్టింది. వంశీతో పాటు నిందితులుగా ఉన్న మరో ఇద్దని కూడా మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తనకేమీ తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణితో వంశీ సమాధానాలు చెప్పారని, మరింత సమాచారం రాబట్టేందుకు ఏ4 నిందితుడిగా ఉన్న వీరరాజును,వంశీని మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలను విన్న కోర్టు రేపు తీర్పును వెలువరించ లేదు. రేపు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడుగా ఉన్నారు.