YVU- Kadapa | 'సైబర్ టెక్' తో వేమన వర్సిటీ ఒప్పందం

ఉపాధి ఆధారిత కోర్సుల బోధనకు కడప వైవీయూ (Yvu) ఒప్పందం చేసుకుంది. నైపుణ్యంతో కూడిన విద్య అందించడానికి అడుగులు వేసింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-08 15:36 GMT
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం

మారుతున్న కాలం. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కూడా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం (Yogi vemana university - Yvu) ఉపాధి ఆధారిత విద్య బోధన దిశగా ఒప్పందాలు చేసుకుంది. సాంకేతిక విద్యా బోధనతో పాటు ప్లేస్ మెంట్లు చూపించే దిశగా కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఒప్పదం చేసుకుంది. హైదరాబాద్ లోని సైబర్ టెక్ సొల్యూషన్స్ తో ఒప్పందం కుదిరినట్లు వైవీయూ పీఆర్ఓ డాక్టర్ పీ. సరిత చెప్పారు.


ఇన్నోవేట్ సైబర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ( హైదరాబాద్)తో పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ సీఈవో మోనిక, ఎండీ అభిమన్యు రావు, ప్రోగ్రాం డెవలపర్‌ మండూరు అయ్యప్ప, యోగివేమన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథరెడ్డి ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.

ఆదర్శవంత విద్య కోసం..
"ప్రముఖ సంస్థలకు, పరిశ్రమలకు మానవ వనరులను అందించే సైబర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతారు" అని వైవియు వీసీ ఆచార్య కే. కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలకు ప్రమోట్ చేస్తారని ఆయన వివరించారు.
వైవీయూ విద్యార్థులకు శిక్షణ, ప్లేస్ మెంట్, ఇంటర్న్ షిప్, ప్లెస్మెంట్ అందించడానికి తోడ్పాటు అందిస్తాం" అని ఆ సంస్థ సీఈవో మౌనిక తెలిపారు. రెండేళ్ల పాటు ఈ తరహాలో విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యా బోధనకు సహకారం అందివ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు మౌనిక చెప్పారు. ఇందులో ప్రధానంగా ఇఫిషియల్ ఇంటెలిజెంట్, సెయిల్ పాయింట్ ,సైబర్ఆర్క్, ఒరాకిల్, హెచ్ సి ఎం, శాప్ ఏఐ, శాప్ ఎండిజీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, పైథాన్ జాంగో, SAP ఇంటోన్, ఫుల్ స్టాక్ పైథాన్, వెబ్ డెవలెంట్, బ్లాక్ చైన్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూట్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని మౌనిక వివరించారు.
Tags:    

Similar News