యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారిన ‘వివేకం’ మూవీ

వైఎస్‌ వివేకా హత్య సెంట్రిక్‌ పాయింట్‌గా వివేకం మూవీ తీసారు. భారీగా పెరిగిన ప్రేక్షకులు. ఒక్క రోజులో వీక్షించిన 10లక్షల మంది. వైరల్‌గా మారిన సన్నివేశాలు;

Update: 2024-04-01 14:17 GMT


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు.. ప్రస్తుత ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతాన్ని ప్రధాన అంశంగా ఆయన బయోపిక్‌గా తెరకెక్కించిన ‘వివేకం’ మూవీ తాజాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఇది హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రానికి పెద్ద ఎత్తున వీక్షకులు పెరుగుతున్నారు. కేవలం ఒక్క రోజులోనే దాదాపు 10లక్షల మంది వీక్షించారంటే ఏ స్థాయిలో ట్రెండింగ్‌ అవుతుందో అర్థమవుతుంది. శుక్రవారం ఈ మూవీని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీలోని కొని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతున్నాయి. వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులు.. హత్యకు ఎక్కడ కుట్రలు పన్నారు.. ఆ కుట్రలు పన్నిందెవరు.. అసలు వారి వెనుక ఉన్న సూత్రదారులు ఎవరు.. ఎలా కుట్రలు పన్నారు..వంటి çపలు ఆసక్తికర సన్నివేశాలతో పాటు వివేకాను అత్యంత కిరాతంగా హతమార్చడం వంటి సీన్లు వివేకం మూవీలో కళ్లకు కట్టినట్లు హృద్యంగా చిత్రీకరించారు.

హైకోర్టుకు దస్తగిరి
వివేకం మూవీ ఎలా ఉంది.. ఎలా తీశారు తదితర అంశాలు ఒకెల్తైతే.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈ మూవీలో తన పేరు ఉండటంపై హైకోర్టును ఆశ్రయించారు. తన స్టేట్‌మెంట్‌ ఆధారంగా వివేకం తీసారని, హత్య కేసు ప్రస్తుతం సీబీఐ కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల ఈ సినిమా ప్రదర్శనను నిలపేయాలని కోర్టును కోరారు. టీడీపీ డిజిటల్‌ విభాగమైన ఐటీడీపీ ప్రోత్సాహంతోనే వివేకం మూవీ అన్ని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌లో అందుబాటులో ఉంచినట్లు పిటీషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే టీడీపీ ఈ సినిమాను ప్రదర్శిస్తోందని తెలిపారు.
ఇది వరకే వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో ఉండగానే అభ్యంతరకరంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మార్చి 20న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివేకం మూవీ హింసను ప్రేరేపించేలా ఉందని సీఈసీకి వివరించారు. వివేకం మూవీని యూట్యూబ్‌లో విడుదల చేయడం, వివేకా బయోపిక్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేడయం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివేకం సినీమాను బ్యాన్‌ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News