యూ ట్యూబ్‌లో పోర్న్ వీడియోలు చూడటం ఒక బలహీనత: సీఎం చంద్రబాబు
బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.;
యూ ట్యూబ్‌లో పోర్న్ వీడియోలు చూడటం ఒక బలహీనత అని.. అదొక అడిక్షన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు వాటిని చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ల పట్ల, ల్యాబ్ ట్యాప్‌ల పట్ల పిల్లలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ చూడటం కూడా ఒక వ్యసనమని అన్నారు. బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు, ల్యాబ్ ట్యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు, తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు తయారయ్యారు. వారు పిల్లలతో ఫ్రెండిషిప్‌లు చేయడం, మాయ మాటలు చెప్పడం, మభ్యపెట్టడం, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహమనే పేరుతో మోసం చేస్తున్నారు. అశ్లీలమైన ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ కూడా అవసరం. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. మోసం చేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.