ఉగ్రవాద అణచి వేతకు అండగా ఉంటాం..బాబు

భారత దేశంలో ఉగ్రవాద అణచి వేతకు అండగా ఉంటాం. ఆయన విజన్ నాకు బాగా నచ్చింది. టెక్నాలజీని గుర్తించే ప్రధాన మంత్రి మోదీ అని సీఎం చంద్రబాబు అన్నారు.;

Update: 2025-05-02 11:56 GMT

వందే మాతరం. వందే మాతరం. వందే... మాతరం... అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని అమరావతిలో ప్రారంభించారు. భారత్ మాతాకీ జై కొట్టించారు. భారత దేశం మొత్తం మోడీ నాయకత్వంలో పరిపాలనను సంపూర్ణంగా సమర్థించే పనిలో ఉన్నారని అన్నారు. ఒక ఫ్యాలిలీ, కంపెనీ ఏదైనా ఎఫెక్టివ్ గా ఉంటే అది బాగు పడుతుంది. రైట్ టైమ్ లో రైట్ డెసెషన్ మోదీజీ తీసుకుంటారు. ప్రపంచమంతా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తోందని అన్నారు. మోదీజీ మోడల్ డెవలప్మెంట్, ఎంపవర్ అని అన్నారు. పేదరిక నిర్మూలన మోదీ ఐడియాలజీ అని అన్నారు. నేను అభినందిస్తున్నా.

ఇటీజ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ అని సీఎం ప్రధానిని అభినందించారు. మనం గుర్తు పెట్టరుకోవాల్సింది, 2024 ఎన్నికల్లో మీఅందరూ ఓట్లు వేశారు, నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఆశ్రయమిచ్చారు. ఇప్పుడు సహకరించారు. మరి కొన్ని రోజులకు రాష్ట్రం మరింత బలపడుతుంది. అని అన్నారు. పచ్చదనం తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇనిస్ట్యూటషన్స్ ఉన్నాయి. ఇంకా మరికొన్ని వస్తున్నాయి అని చంద్రబాబు చెప్పారు. మోదీజీ టెక్నాలజీని అర్థం చేసుకుంటారు. యూపీఐ వరల్డ్ లోనే గొప్ప కార్యక్రమం. ఏఐ ఈజ్ గేమ్ చేంచర్. అమరావతిని అభివృద్ది చేయడమే కాదు. 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేస్తామని అన్నారు.

బోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం. విశాఖ రైల్వేజోన్ ఇచ్చినందుకు అభినందనలు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అడ్డంకులు పీఎం తొలగించారు. సీమలో హైకోర్టు బెంజ్ ఏర్పాటు చేస్తాం. తిరుపతిని స్పిరిచ్యువల్ హబ్ గా తయారు చేస్తాం. ప్రధాన మంత్రి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కు శంకుస్థాపన చేశారు. డబుల్ జింజన్ సర్కార్ వల్ల, కేంద్ర సహకారం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. ప్రధాని ఆశీస్సులతో ముందుకు పోతాం. జూన్ 21న 10వ యోగా డే జరుపబోతున్నాం. అది నరేంద్ర మోదీ ప్రపంచానికి ఇచ్చే కానుకని నేను చెబుతున్నా. యోగాను ప్రమోట్ చేస్తారు. త్వరలో వారు వస్తారు. వారి రాక ఒక స్పూర్తి. టానిక్ అని చెప్పుకుంటున్నా. జైహింద్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News