టీచర్లకు జీతాలెప్పుడు చెల్లిస్తారో?

గత ప్రభుత్వం సరిగా జీతాలు చెల్లించ లేదు. కూటమి అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితులు నెలకొన్నాయి.;

Update: 2025-01-04 13:49 GMT

ఇంటర్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పిల్లలకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నెలకు జీతాలు చెల్లిండం మరిచిపోయారేమో అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూతన సంవత్సరం వచ్చింది. నాలుగు రోజులు గడిచాయి. ఇంత వరకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించ లేదు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ వేడుకను శనివారం రాష్ట్ర పండుగలా నిర్వహించారు. ప్రతి మంత్రి, ప్రతి అధికారి సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు వెళ్లడం అక్కడ విద్యార్థులతో కూర్చుని భోజనం చేయడం తర్వాత పబ్లిసిటీ కోసం ఫొటోలకు ఫోజులివ్వడం మామూలుగా మారి పోయింది. ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్‌ విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెద్ద వేడుకలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాంఛింగ్‌ తర్వాత పిల్లలతో ఆయన కూర్చుని సహపంక్తి భోజనం చేయడంతో ఆయనతో పాటు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విద్యార్థులతో సహపంక్తి భోజనం చేయడం తప్ప లేదు.
Delete Edit
ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలె బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్‌ కర్నూలులోని ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆయనతో పాటు కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాష, ఇతర అధికారులకు విద్యార్థులతో సహపంక్తి భోజనం చేయడం తప్ప లేదు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం దీనిని ప్రారంభించడంతో ప్రతి చోటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఇతర అధికారులు సహపంక్తి భోజనాలు చేయడం తప్పని పరిస్థితి నెలకొంది.
Delete Edit
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లెంచే అంశాన్ని మరిచి పోయారు. జనవరి 4వ తేదీ అయినా కూడా నేటికీ వారి ఖాతాల్లో జీతాలు జమ చేయలేదు. రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో అని ఎదురు చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినా కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా 1న జీతాలు చెల్లిస్తామని చంద్రబాబు, పవన్‌లు హామీలివ్వడమే కాకుండా ఊరూరా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని చెత్త బుట్టలో పడేశారనే విమర్శలు టీచర్లలో వినిపిస్తున్నాయి. కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలి నెలలో తప్ప తక్కిన నెలల్లో 1వ తేదీనా చెల్లించ లేక పోయారు. టీచర్లతో పాటు ఇతర ఉద్యోగులకు కూడ సక్రమంగా జీతాలు చెల్లించలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పెన్షనర్లకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరో వైపు దాదాపు రూ. 5వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు ఎందుకు ఆసక్తి కనబరచడం లేదనేది ఉపాధ్యాయ వర్గాల్లో ప్రశ్నర్థాకంగా మారిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.
Tags:    

Similar News