రఘురామా, టికెట్ ఎవరిస్తే అటేనా రాజా!

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రఘురామకృష్ణరాజు దారు ఎటన్నది ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉంది. మరి రఘురామ.. ఏ పార్టీలో చేరుతారో..

Update: 2024-03-11 09:39 GMT
Source: Twitter


రఘురామకృష్ణ రాజు.. వైసీపీ ఎంపీగా ఉంటూ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగి ఐదేళ్ల పాటు స్వపక్షంలో విపక్షంగా ఉన్న అత్యంత వివాదాస్పద నేత. ఆయన గత నెల 24న ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాను ఏ పార్టీ కండువా కప్పుకోనున్నది చెప్పలేదు. ఇప్పటికీ రఘురామ ఏ పార్టీలో చేరతారన్నది ఆంధ్రలో మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం లోక్‌‌సభ ఎన్నికలు దగ్గపడుతుండటంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నరసాపురం అంతా కూడా రఘురామ దారెటనే చర్చే జరుగుతోంది. కొందరు టీడీపీవైపే రఘురామ చూస్తున్నారంటే మరికొందరు మాత్రం ఆయన బీజేపీ లేదా జనసేనలోనే చేరతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ఎవరిస్తే అటేనా...

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఖరారయింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణ రాజు.. టీడీపీ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం. దాంతో పాటుగా నరసాపురం ఎంపీ టికెట్ తనకు ఎవరిస్తే ఆ పార్టీలో చేరడానికి రఘురామ యోచిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నర్సాపురం టికెట్ రఘురామకు ఇస్తేనే ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి రఘురామరాజు.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లే ఉంది.

టీడీపీ ప్లాన్ అదే...

నరసాపురం నియోజకవర్గాన్ని టీడీపీ తన సొంతం చేసుకోవడానికి యత్నిస్తోందని, ఇందులో భాగంగానే రఘురామ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. పొత్తులో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రఘురామ.. బీజేపీ అభ్యర్థిగా నిలిస్తే మూడు నియోజకవర్గాల్లో టీడీపీ లేకుండా పోతుంది. కాబట్టి రఘురామ.. టీడీపీ తరపున బరిలోకి దిగితే అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ పోటీలో ఉంటుందని, అందుకే ఏది ఏమైనా నర్సాపురం నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవడానికి టీడీపీ నిర్ణయించుకుందని, ఆ దిశగానే చర్చలు కొనసాగిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి నరసాపురం నియోజకవర్గం ఏ పార్టీకి చెందుతుందో చూడాలి.

రఘురామకృష్ణ రాజు నేపథ్యం

రఘురామకృష్ణ రాజు 2014లో వైసీపీ నుంచి లోక్‌సభ టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2018లో బీజేపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఆయన మళ్లీ వైఎస్ఆర్‌సీపీలో చేరారు. నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుపై 31,909 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎంపీగా కన్నా జగన్‌పై విమర్శలు సంధించే ఎంపీగానే ఎక్కువ ఫేమస్ అయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌‌గా మార్చాలని జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ రఘురామ తీవ్రంగా వ్యతిరేకించారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రఘురామకృష్ణరాజు దారు ఎటన్నది ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉంది. మరి రఘురామ.. ఏ పార్టీని ఎన్నుకుంటారో..ఆ అంశంపై ప్రభుత్వానికి, ఎంపీకి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత నుంచి పలు సందర్బాల్లో ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పథకాలపై రఘురామ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆపై 2021 మార్చిలో రఘురామపై సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్లో ఆ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏ పార్టీ టికెట్ పై పోటీ చేస్తే గెలుపు తధ్యమనే అంశంపై గుంజాటన పడుతున్నారు.


Tags:    

Similar News