బయటెందుకు అసెంబ్లీకి రా జగన్ తేల్చుకుందాం!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి రైతు సమస్యల్ని ప్రస్తావించాలని టీడీపీ సవాల్ చేసింది.;

Update: 2025-02-21 11:03 GMT
kollu Ravindra
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి రైతు సమస్యల్ని ప్రస్తావించాలని టీడీపీ సవాల్ చేసింది. సభకు రాకుండా బయట ఎంత యాగీ చేసినా ఏమి ఫలితం ఉంటుందో చెప్పాలని, డ్రామాలు ఆపాలని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని ఆరోపించారు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? లేదా అని ప్రశ్నించారు. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోపెట్టిన... జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆక్షేపించారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా... రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డ్‌కు వెళ్లారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మంత్రి రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. బూతులు మాట్లాడటానికైతే ఉద్యోగం అవసరం.. ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం, అధికారంలో ఉన్న... ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశామని స్పష్టం చేశారు. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా... ఖ్యాతిని తిరిగి తీసుకువచ్చేందుకు కూటమి నేతలంతా కలిసి కష్టపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Tags:    

Similar News