ఈ మార్పు గత ఫలితాలనిస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తవారికి అవకాశం ఇస్తోంది. నూతనంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా ఫలితాలు ఈ సారి ఎలా వుంటాయి. గతంలో లాగా వీరు గెలుస్తారా?

Byline :  The Federal
Update: 2024-01-18 11:59 GMT
Satyasai mandir

ఈ జిల్లాలో హిందూపూర్ తప్ప అన్నినియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ వారే గెలిచారు. వైఎస్సార్సీపీ గాలిలో గెలిచారే తప్ప వారి గొప్పతనం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వారిదే హవా. వారే ఎక్కువగా గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి, ఈ ఎన్నికల్లోనూ తప్పకుండా వస్తాయనే నమ్మకంతో వైఎస్సార్సీపీ వుంది. కానీ ప్రస్తుతం వీస్తున్న గాలి అలా లేదు.

ఒక్కటి మినహా ప్రస్తుతం అన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే..

జిల్లాలో హిందూపూర్ మాత్రమే తెలుగుదేశం పార్టీ ఖాతాలో ప్రస్తుతం వుంది. మిగిలినవన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే హిందూపూర్, కదిరి, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది వికటించే అవకాశం వుందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం వున్న వారు కొంతవరకు నియోజకవర్గాల్లో నిలదొక్కుకునేలా కార్యక్రమాలు చేశారని, అయినా రాజకీయ బదిలీలు తప్పడం లేదనే ఆవేదన నాయకుల్లో వుంది.

తెలుగుదేశం పార్టీలో పెరిగిన ధీమా

తెలుగుదేశం పార్టీలో గెలుపు ధీమా పెరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించిన తరువాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనతో ఉంది. అయితే ప్రస్తుతం ఇన్చార్జీలుగా వున్న వారికే ఎక్కువ అవకాశం కల్పించాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. కొత్తవారి గురించి అర్థం చేసుకునేలోపు ఓటర్లను తమవైపు తిప్పుకుంటామనే హామీని ప్రస్తుత అభ్యర్థుల నుంచి తీసుకుంటున్నారు.

రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి, పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది. వీరు సిటింగ్ ఎమ్మెల్యేలు కావడం విశేషం.

Tags:    

Similar News