సీట్ల కేటాయింపులో మహిళలకు పెద్దపీట
మహిళలకు పెద్దమొత్తంలో సీట్లు కేటాయించి మా ప్రభుత్వం మహిళా పక్షపాతిగా నిలిచిందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మాట్లాడారు.;
మహిళల సాధికారతకు పెద్ద పీట వేçస్తూ 2019లో ఇచ్చిన 19 సీట్ల కన్నా 2024లో 24 ఇవ్వగలిగాం, మరింతగా మహిళలకు ఆవకాశాలు ఇవ్వాలని ఆశపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మాట్లాడారు.
ఈరోజు 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు కేటాయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. దాదాపు 99 స్థానాల్లో మార్పులు చేశాం. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశాం. టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా భరోసా. విప్లవాత్మక మార్పులతో ఈ ఐదేళ్ల పాలన జరిగింది. ఎక్కడా లంచం లేకుండా సంక్షేప పథకాలు ప్రజలకు అందాయి. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో ఇది లిఖించదగిన అంశం. గ్రామాలు మారాయి. స్కూల్స్ బాగుపడ్డాయి. ఆసుపత్రులు మారాయి. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించాం. మార్పులను ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తాం ఎపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి.