మీ ప్రభుత్వం ఎల్ల కాలం ఉండదు..ఎక్కడున్నా రప్పిస్తాం : జగన్
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పాలనా తీరుపై మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మీ ప్రభుత్వం ఎల్ల కాలం ఉండదని, చూస్తూ ఊర్కోబోమని, ఎక్కడున్నా రప్పిస్తామని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మీ ఇష్టానుసారం, మీ ఇష్టం వచ్చినట్లుగా మీ వ్యవహారం ఉంటే, ఒక్క విషయం గుర్తుంచుకోవాలని, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పు చేస్తుంటే మేము చూస్తూ ఊర్కోబోమన్నారు. ప్రతి పోలీస్ ఆఫీసర్ తప్పు చేసిన వారిపై ప్రెయివేట్ కంపై్లంట్ చేస్తామన్నారు. ప్రతి బాధితుడు ప్రై యివేట్ కంపై్లంట్ చేస్తాడని, వారికి మా పార్టీ అఫీషియల్‌గా సపోర్టు చేస్తుందన్నారు. అధికారం ఎల్లకాలం ఉండదన్నారు. జమిలీ అంటున్నారని, ఎన్నికలు త్వరలోనే రావొచ్చని, లేదా ఈ ప్రభుత్వం ఉండేది నాలుగేళ్లే అని, ఆ తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని, మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్‌ను దగ్గరుండి బయటకు తీస్తామని, రిటైర్ అయినా పిలిపిస్తామని హెచ్చరించారు. సప్త సముద్రాల అవుతల ఉన్నా కూడా పిలిపిస్తామన్నారు. ప్రతి పోలీస్ ఆఫీసర్‌కు చెబుతున్నాం. చూస్తూ ఊర్కోబోమని, చట్టం దగ్గర దోషులుగా నిలబెడతామన్నారు. చేసిన తప్పులన్నీ బయటకు తీస్తామన్నారు. రెడ్‌బుక్ పెట్టుకోవడం పెద్ద పని కాదు. ఇవాళ ప్రతి బాధిత కుటుంబం ఒక రెడ్‌బుక్ పెట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. వారంతా వచ్చి తమ బాధ నాకు చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊర్కోను అని మండిపడ్డారు. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెబుతున్నాను అంటూ తీవ్ర స్థాయిలోనే హెచ్చరికలు చేశారు.