విజయవాడ వరద ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటన

విజయవాడను భారీ వరద ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని వదర ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు సీఎం చంద్రబాబు పర్యటిస్తూ అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తున్నారు.

Update: 2024-09-02 15:10 GMT

విజయవాడను భారీ వరద ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని వదర ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు సీఎం చంద్రబాబు పర్యటిస్తూ అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈరోజు విజయవాడలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితుల అధికారులతో చర్చించారు. అనంతరం బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా ప్రభుత్వ సాయం సరిగా అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణలంకలో పర్యటించిన జగన్.. అక్కడి వరద బాధితులను పరామర్శించారు. వారికి తమ పార్టీ అండగా నిలుస్తుందని, తమకు చేతనైంతన సాయం తాము చేస్తామని చెప్పారు. జగన్‌కుస్వాగతం పలికిన ప్రజలు.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో నిర్మించిన కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కాణంగానే తాము ఇంకా సురక్షితంగా ఉన్నామని, ఆ రిటర్నింగ్ వాల్ లక్షల మందికి రక్షణ కల్పింస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

 

పట్టించుకోని ప్రభుత్వం..

మూడు రోజుల నుంచి వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, అయినా కృష్ణలంక ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘మూడు రోజుల నుంచి తిండి, తిప్పలు లేకుండా మీరంతా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమైనా అందుతుందా?’’ అని ప్రశ్నించారు.

 

జగన్ ప్రశ్నకు స్పందించిన ప్రజలు ‘‘మాకోసం ఏ నాయకుడు రాలేదు. మీరుమాత్రమే వచ్చారు. తొలి అంతస్తును వరదనీరు అందుతున్నా ఇక్కడి వారికి సాయం చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకటో అంతస్తులో తల దాచుకున్న చిన్నారులు రెండు రోజుల నుంచి తిండితిప్పలు లేక ఇబ్బంది పడుతున్నారు’’ అని తమ బాధను చెప్పుకున్నారు.

Tags:    

Similar News