జగన్ పై షర్మిల అంతలా రెచ్చిపోయారెందుకు?

దివంగత నేత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల ఓరేంజ్ లో తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రెచ్చిపోయారు. వైఎస్ పేరుకే మచ్చతెస్తావా అంటూ విరుచుకుపడ్డారు.

Update: 2024-10-22 04:13 GMT

దివంగత నేత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల ఓరేంజ్ లో తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రెచ్చిపోయారు. వైఎస్ పేరుకే మచ్చతెస్తావా అంటూ విరుచుకుపడ్డారు. అసలింతకీ ఏమి జరిగిందంటే..

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అద్భుత పథకాలలో ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి. ఈ పథకం కింద లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. అనేక మంది ఉన్నత చదువులు చదివారు. అటువంటి పథకాన్ని తాను అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఆ తర్వాత నీరు గార్చారన్నది వైఎస్ షర్మిల ఆరోపణ. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో సుమారు 3,500 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టారని, ఇది విద్యార్థుల పాలిట శాపంగా ఆమె ఆరోపించారు. "విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా? రీయింబర్స్‌మెంట్‌ పథకం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక. నాడు వైఎ్‌సఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారు. వైఎస్ జగన్ ఆ పథకాన్ని నీరు కార్చారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?" అని ఆమె విమర్శించారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియా "ఎక్స్" వేదికగా ట్వీట్ చేశారు. ఆయన సొంత కొడుకై ఉండి జగన్‌ తన హయాంలో ఈ పథకాన్ని నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags:    

Similar News