చంద్రబాబు పాప పరిహారం చెల్లించాల్సిందే: వైసిపి దాడి
డీలా పడిన వైసిపిలో ఉన్నట్లుండి నూతనోత్సాహం
ఈ రోజు లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు చేిసిన వ్యాఖ్యలు డీలా పడిన వైసిపి కాంగ్రెస్ లో ఉత్సాహం నింపాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు మీద చేసిన ఆరోపణలన్నీ అబద్దాలని, లడ్డును రాజకీయం కోసం వాడుకున్నారని వైసిసి నేతలు పేర్కొన్నారు. పార్టీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా, పార్టీ నేతలు, మాజీ మంత్రులు ఒకరొకరు స్పందిస్తున్నారు. చంద్రబాబు లడ్డును ప్రతిష్ట ను మంటగలిపి పాపం చేశారని పరిహారం చెల్లించకతప్పదని అంటున్నారు.
ప్రసాదానికి మలినం అంటగట్టాలని చూసి చంద్రబాబు భంగ పడ్డారని, ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలతో చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, టిటిడి మాజీ ఛెయిర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అసలు లడ్డు ప్రతిష్టను భంగపరిచి భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి దెబ్బతీశాడని అయన అన్నారు.
మాజీ మంత్రి ఎస్ కె రోజా మాట్లాడుతూ లడ్డు మీద చంద్రబాబు వేసిన సిట్ మీద తమకు నమ్మకం లేదని, దర్యాప్తు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరగాలని అన్నారు. సిట్ చంద్రబాబు కనుసన్నల్లో నడిచే సంస్థ అని అంటూ తమకు ఆ దర్యాప్తు మీద నమ్మకం లేదని ఆమె అన్నారు.