ఆ జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్ స్వీప్.. మరి ఈ సారి?
గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఆ నాలుగు జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి అలానే ఉందా. తిరిగి అదే రికార్డును సొంతం చేసుకునే సత్తా ఉందా?.
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా నడిచింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాలను కొల్లగొట్టింది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని రికార్డు నెలకొల్పింది. విజయనగరంలో 9, నెల్లూరులో 10, కడపలో 10, కర్నూలు జిల్లాలో 14 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్ని స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. నాడు తెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక నేతల్లో జగన్‌పై ఉన్న అభిమానం వెరసి నాలుగు జిల్లాల్లోని అన్ని సీట్లను నూటికి నూరు శాతం గెలుచుకునేలా చేసింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో క్లీన్ స్వీప్ చేయడమంటే ఆ పార్టీపై ప్రజలు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో అర్థమవుతుంది.