బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో నెలలోనే ఆరుగురు మృతి

కేరళలో జూలై నుంచి ఎక్కువయిన "బ్రెయిన్ ఫీవర్" కేసులు;

Update: 2025-09-11 14:09 GMT
Click the Play button to listen to article

కేరళ(Kerala)ను బ్రెయిన్ ఈటింగ్ అమీబా వెంటాడుతోంది. ఒక్క నెలలోనే ఆరుగురు మృత్యువాతపడ్డారు. మల్లాపురం జిల్లాకు చెందిన షాజీ (47) ఆగస్టు 9న కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరాడు. పరీక్షల అనంతరం వైద్యులు మెదడు తినే అమీబా బారిన పడ్డాడని నిర్ధారించారు. గురువారం (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. సోమవారం మలప్పురం జిల్లాలోని వండూర్‌కు చెందిన 54 ఏళ్ల మహిళ కూడా ఇదే ఇన్ఫెక్షన్‌తో మరణించింది. దీంతో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా నెలలోపే చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. షాజీకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా సోకిందో అధికారులు ఇంకా తేల్చలేదు. ప్రధానంగా కలుషిత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జూలై నుంచి తరచుగా "బ్రెయిన్ ఫీవర్" కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో.. ఆరోగ్య అధికారులు ఉత్తర కేరళలో బావులు, చెరువులలో క్లోరినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 

Tags:    

Similar News