కేంద్ర నిధులు : అడిగారు.. అభ్యర్థించారు.. చివరకు కోర్టు మెట్లెక్కారు

దక్షిణాది రాష్ట్రాలు తమకు కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. కేంద్ర ఇచ్చిన మాట ప్రకారం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన..

Update: 2024-04-05 12:32 GMT

తమకు కేంద్రం నుంచి ఉదారంగా నిధులు రావట్లేదని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరుచూగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడా కూడా లేవు. అందుకే మాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ పాలిత, లేదా ఆ పార్టీతో అనుబంధం ఉన్న పార్టీలే పాలిస్తున్నాయి.

"డబుల్-ఇంజిన్ సర్కార్ "ను బిజెపి గట్టిగా ప్రచారం చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలిస్తే లాభాలు అధికంగా ఉంటాయని పార్టీ సిద్దాంతంగా ఉంది. అలా లేకున్నా రాష్ట్రాలకు సరైన విధంగా నిధులు రావట్లేదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని మిగిలిన రాష్ట్రాలు అంటున్నాయి. బీజేపీ కోఆపరేటివ్ ఫెడరలిజం కంటే కేంద్రం 'ఘర్షణాత్మక ఫెడరలిజం'కు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
నిధుల కోసం అడిగారు.. అభ్యర్థించారు. సమాఖ్య వ్యవస్థలో హక్కుగా డిమాండ్ చేయడంతో, మూడు దక్షిణాది రాష్ట్రాలు పరిహారం కోసం ప్రత్యేక వ్యాజ్యాల ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమకు రావాల్సిన నిధులను విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు గత నెలరోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విపత్తుల కోసం నిధులు
ఈ మూడు రాష్ట్రాలలో, తమిళనాడు, కర్ణాటక ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన నిధులను విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్లపై తీర్పు రాకముందే, తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వీటి నుంచి బయటపడేయడానికి వెంటనే రుణ పరిమితిని పెంచాలని కోరుతూ ఈ మధ్య కేరళ, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు మధ్యంతర ఉపశమనం కావాలని కోర్టును అభ్యర్థించింది. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
రాష్ట్రాలు చట్టపరమైన మార్గంలో ఎలా వ్యవహరిస్తున్నాయి, అభియోగాలపై కేంద్రం ఎలా స్పందిస్తుంది. ప్రతి కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాబోయే దశాబ్దాలకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుందనేది మాత్రం సత్యం.
తమిళనాడు: తుపాను ఉపశమనం..
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిలుపుదల చేసిందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది . ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేంద్రంపై అసలు దావా వేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 131ని ప్రయోగించింది.
ఇటీవలి వరదలు, మైచాంగ్ తుఫాను కారణంగా సంభవించిన నష్టాలకు రూ. 37,000 కోట్లకు పైగా సాయం అందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
గత ఏడాది డిసెంబర్‌లో మైచాంగ్ తుఫాను వల్ల సంభవించిన నష్టానికి రూ.19,692.69 కోట్ల ఆర్థిక సాయం కోరడంతో పాటు, రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అపూర్వమైన వర్షాల కారణంగా సంభవించిన నష్టాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.18,000 కోట్ల నిధులను కోరింది. మధ్యంతర చర్యగా రూ.2,000 కోట్లు విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరింది. నిధుల కేటాయింపులో భిన్నమైన వైఖరిని తమిళనాడు పేర్కొంది. ఇది వివక్ష, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. అయితే కేంద్రం సహాయ నిధులను నిలుపుదల చేసిందనే ఆరోపణలను, అధికార బిజెపి ఖండించింది,
కర్నాటక: కరువు ఉపశమనం
కరువు పరిస్థితులను పరిష్కరించడానికి కేంద్రం ఆర్థిక సహాయం చేయడం లేదని ఆరోపిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది . నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించుకున్నారు. తమకు వేరే మార్గం లేదని, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద తమ క్లెయిమ్‌ను స్వీకరించడానికి ఐదు నెలల పాటు వేచి చూశామన్నారు. తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. అయితే, నిధుల కోసం చట్టపరమైన ఆశ్రయాన్ని కోరినందుకు కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ, జేడీ(ఎస్) విమర్శలు గుప్పించాయి.
రాజ్యాంగ పరిహారానికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పౌరులు తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని విశ్వసిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఇది అనుమతిస్తుంది.
ఆర్థిక కారణాలపై కేంద్రం, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య పెద్దఎత్తున విభేదాలు తలెత్తడం ఇది రెండో సారి. గత నెలలో, సిద్ధరామయ్య, అతని డిప్యూటీ డికె శివకుమార్ పన్నులు, ఇతర కేటాయింపులలో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ "ఢిల్లీ చలో" నిరసన చేపట్టారు .
కేరళ: రుణ పరిమితులు
మధ్యంతర ఉపశమనం కోసం కేరళ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, ఆర్థిక విధానంపై వ్యాజ్యం వేయాలా వద్దా అనే సమస్యను ఐదుగురు న్యాయమూర్తుల పెద్ద బెంచ్‌కు కోర్టు సూచించింది. గత ఏడాది రుణాల పరిమితులు దాటితే, ఆ తర్వాతి సంవత్సరంలో రుణాలను తగ్గిస్తామనే కేంద్రం వైఖరితో సుప్రీంకోర్టు ప్రాథమిక అంగీకారాన్ని వ్యక్తం చేసింది.
"రాష్ట్రం తన స్వంత ఆర్థిక దుర్వినియోగం కారణంగా తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులను సృష్టించినట్లయితే, అటువంటి కష్టాలను కోలుకోలేని గాయంగా పరిగణించలేము, అది యూనియన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉపశమనం అవసరం" అని సుప్రీం కోర్టు ఉత్తర్వులు పేర్కొంది.
కేంద్రం ఏకపక్షంగా నికర రుణాలు తీసుకునే సీలింగ్‌ను విధిస్తోందని, అది తీసుకునే రుణ మొత్తాన్ని పరిమితం చేసిందని కేరళ పిటిషన్ లో ఆరోపించింది. తన ఆర్థిక అవసరాలు తీరడానికి రూ. 26 వేల కోట్లు కావాలంది. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
నిధుల మూలాలు..
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ సర్కార్.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బహిరంగ మార్కెట్‌తో సహా అన్ని వనరుల నుంచి నిధులను సేకరించకుండా పరిమితం చేసిందని కేరళ ఆరోపించింది.
ఈ కేసులో తక్షణ ఉపశమనం పొందకపోతే, కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని కేరళ వాదిస్తూ అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు కోరింది. కానీ న్యాయస్థానం ఈ వాదనను తిరస్కరించింది, "'ద్రవ్య నష్టం' అనేది కోలుకోలేని నష్టం కాదంది "
13, 608 కోట్ల రుణ పరిమితిని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వన్-టైమ్ ఆఫర్ చేసిందని, ఈ మధ్యంతర దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో కేరళ గణనీయమైన ఉపశమనం పొందిందని సుప్రీంకోర్టు గమనించింది.
పశ్చిమ బెంగాల్.. ఫిర్యాదులు
ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం నిరాకరిస్తున్నదని పదే పదే ఆరోపించింది .
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీన్) (PMAY-G), ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) అనే మూడు గ్రామీణాభివృద్ధి పథకాల కింద రాష్ట్రానికి దాదాపు రూ. 18,000 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపించింది. అంతే కాకుండా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పథకాల కింద కూడా రూ.7,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించింది. అయితే విడుదలైన నిధుల్లో అనేక అవకతవకలు చేశారని వీటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. వీటిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నివేదిక పంపితేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది.
MGNREGA నిధులు
కేంద్రం MGNREG చట్టం, 2005లోని సెక్షన్ 27ను అమలు చేసింది. మార్చి 2022లో రాష్ట్రానికి నిధుల విడుదలను నిలిపివేసింది. PMAY-G పథకం కింద పశ్చిమ బెంగాల్‌కు నిధుల విడుదలను కూడా కేంద్రం నిలిపివేసింది.
మరోవైపు, తన పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కేంద్ర నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలను మమత తోసిపుచ్చారు. అయితే, దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కాకుండా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిధుల కోసం చట్టపరమైన మార్గాన్ని తీసుకోలేదు. బదులుగా గత నెలలో దాదాపు 30 లక్షల మంది MGNREGA కార్మికులకు బకాయిల చెల్లింపును ప్రారంభించింది. ఈ బకాయిలు రూ. 2,700 కోట్లు, మార్చి 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.
Tags:    

Similar News