దగ్గు సిరప్‌ 'కోల్డ్రిఫ్'పై నిషేధం ఎందుకు?

11 మంది చిన్నారుల మరణం తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన సూచనేంటి?

Update: 2025-10-04 09:45 GMT
Click the Play button to listen to article

మధ్యప్రదేశ్(M.P) రాష్ట్రంతో 9 మంది, రాజస్థాన్‌ (Rajastan) రాష్ట్రంలో ఇద్దరు చిన్నపిల్లలు అనుమానాస్పదంగా మృతిచెందారు. మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలనకు వెళ్లారు. ఇంటి పరిసరాలను పరీక్షించారు. తాగే నీళ్లను పరీక్షకు పంపారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ పిల్లలకు 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్ తాపించాక పరిస్థితి విషమించిందని చెప్పడంతో వాటిని ల్యాబ్‌కు పంపారు.

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని సుంగువర్చత్రంలో తయారయ్యే కోల్డ్రిఫ్ సిరఫ్ అమ్మకాలను అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిషేధించినట్లు తమిళనాడు ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారి తెలిపారు. ల్యాబ్ రిజల్ట్ వచ్చే వరకు సిరప్ ఉత్పత్తి నిలిపివేయాలని కంపెనీని ఆదేశించారు.

పిల్లల మరణాల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (అక్టోబర్ 3) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సూచన చేసింది. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు, జలుబు మందులు సూచించరాదని పేర్కొంది.

Tags:    

Similar News