శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు అరుదైన రికార్డు
తెలంగాణలో నెంబర్ వన్, దేశంలోనే ఏడోస్థానం
తెలంగాణలోని షామీర్ పేట పోలీస్ స్టేషన్ మరో సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా పది పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ప్రక్రియలో ఈ సంవత్సరం శామీర్ పేట పోలీస్ స్టేషన్ తెలంగాణలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధిస్తుంది. దేశ వ్యాప్తంగా ఏడోర్యాంకును సాధించడం విశేషం.
దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ (MHA) ఎంపిక చేసిన పది పోలీస్ స్టేషన్లలో తెలంగాణలోని శామీర్ పేట అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. పోలీస్ స్టేషన్ పని తీరు, రికార్డుల తీరు, బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులను సానుకూలంగా పరిష్కారం చూపించడం వంటి అంశాలను పరిగణలో తీసుకున్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం కల్పించింది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలను పరిగణలో తీసుకుని నిర్ణయం తీసుకుంది.