HILT పాలసీపై వర్నర్‌కు ఫిర్యాదు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి పార్టీ నేతల బృందం.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన HILT పాలసీపై బీజేపీ నాయకులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలసీ పేరుతో ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాలని వారు గవర్నర్‌ను కోరారు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చడనికి తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్తోందని, కానీ దీని పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపనున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
అయితే ఈ హిల్ట్ పాలసీపై తొలి రోజు నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీని పేరుతో కాంగ్రెస్ 9,300 ఎకరాల కుంభకోణానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.4-5 లక్షల కోట్లు విలువ చేసే హైదరాబాద్ ఇండస్ట్రీయల్ భూములను స్వాహా చేయడం కోసం రేవంత్ రెడ్డి ముఠా ప్రయత్నిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఇటీవల జరిగిన కొండా సురేఖ ఉదంతం పెద్ద ఉదాహరణ అన్నారు. “రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూమి కనిపించినా, రేవంత్ రెడ్డి ముఠా అక్కడ వాలిపోతోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల దృష్టి ప్రత్యేకంగా ప్రైమ్ లొకేషన్లపై పడుతోంది. బాలానగర్ పరిసరాల్లో దాదాపు 9,300 ఎకరాల్లో భారీ భూ దందా కొనసాగుతోంది. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల్లోని భూములను తమ అనుకూలులకు అప్పగిస్తున్నారని“ అని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఈ పాలసీపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
గతంలో బీజపీ నేత మహేష్ రెడ్డి.. ఈ పాలసీపై ఘాటు వ్యాఖ్యలు చేారు. హిల్ట్ (Hyderabad Industrial Land Transformation) పాలసీ ఒక భారీ కుంభకోణమన్నారు. ‘‘రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ (HILIT) పాలసీ పేరుతో, ఓఆర్ఆర్ పరిధి లోపల 9,292 ఎకరాల విలువైన భూమిని అప్పనంగా కాజేయాలని ప్రణాళిక చేస్తోంది. భూముల మొత్తం విలువ రూ. 6,29,000 కోట్లు, రాష్ట్ర అప్పులన్నీ తీర్చగల స్థాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కేవలం రూ. 5,000 కోట్ల ఆదాయంగా చూపిస్తోంది. ఇది లక్షల కోట్ల రూపాయల కుంభకోణం’’ అని ఆయన పేర్కొన్నారు.