క్షణికావేశంలో భార్యను కడేతర్చిన భర్త
వికారాబాద్ జిల్లాలో దారుణం
ఏడడుగులు వేసి కలిసి జీవించాలనుకున్న బంధాలనే భార్య, భర్తలు తెంపేసుకుంటున్నారు. తెలంగాణలో ఇటీవలికాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. తప్ప త్రాగి వచ్చి భార్య, పిల్లలను వేధిస్తున్నభర్తను ఓ భార్య తిరిగి రాని లోకాలకు చేర్చింది. భర్తను హత్య చేయడానికి కన్న కొడుకు సాయం తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లిలో జరిగింది. ఈ దారుణం జరిగిన ఒక రోజు తర్వాత వికారాబాద్ జిల్లాలో భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు.
క్షణికావేశంలో భార్యను కొట్టిచంపిన ఘటన వికారాబాద్ పెద్దమూల్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దమూల్ తండాకు చెందిన మూడావత్ రవి, అనిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నఈ కుటుంబంలో కొద్దిరోజులుగా కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పొద్దుపోయాక మళ్లీ గొడవ జరిగింది. కోపం పట్టలేక రవి తన భార్యను పారతో కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తలపై, ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అనిత అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని తాండూర్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ ఐ శంకర్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుడైన రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతిరాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు రవిపై హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.