‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం’’

కర్ణాటకలో అధికార మార్పిడిపై స్పందించిన మంత్రి ప్రియాంక్ ఖర్గే ..

Update: 2025-11-28 09:32 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లో నాయకత్వ పోరు పీక్‌కు చేరింది. ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీఎం పీఠం కోసం ముఖ్యమంత్రి (CM Siddaramaiah) సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) మధ్య కొనసాగుతున్న పోరుపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. గందరగోళంగా ఉన్న అధికార మార్పిడి గురించి అడిగినప్పుడు.. దానిపై పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన శుక్రవారం విలేఖరులకు చెప్పారు. పార్టీ పెద్దలు పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ అంగీకరించారని చెప్పారు.


నివేదిక కోరిన రాహుల్..

అధికార మార్పిడి వ్యవహారం కాంగ్రెస్(Congress) అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇద్దరూ అంత పట్టుదలగా ఉన్నారన్న విషయాలను తెలుసుకునేందుకు తన సన్నిహితుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, హర్యానా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ రాహుల్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) కూడా ఈ విషయంలో రాహుల్‌కు ఒక నివేదికను సమర్పించారు.


లోపాయికారి ఒప్పందంలో భాగమేనా?

2023లో పార్టీ గెలిచాక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య, డికె శివకుమార్ పోటీ పడినట్లు సమాచారం. సిద్ధరామయ్య రెండున్నరేళ్లు, ఆ తర్వాత రెండున్నరేళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లు గతంలో వార్తలొచ్చాయి. నవంబర్ 20 వతేదీ నాటికి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో అధికార మార్పిడిపై ఊహాగానాలు ఓపందుకున్నాయి.

Tags:    

Similar News