తెలుగు రాష్ట్రాలకు 'చల్లటి' కబురు
ఠారెత్తిస్తున్న ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. మధ్యాహ్నం తర్వాత చిరుజల్లులు పడే చాన్స్ ఉంది
By : The Federal
Update: 2024-04-08 05:51 GMT
ఠారెత్తిస్తున్న ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. నిన్న ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో పడినట్టే రెెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడే అవకాశం ఉందిని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈవేళ, రేపు కూడా ఎండలు మండిపోతాయి. ఉక్కపోత తీవ్రంగానే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా.
ఏప్రిల్ 8, 9, 10, 11, 12 తేదీల్లో మధ్యాహ్నం, సాయంకాలాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, అల్లూరిసీతరామరాజు జిల్లా, అనకాపల్లి కాకినాడ పాలకొండ, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. గాలి దుమారం, పిడుగులు పడే అవకాశం ఉంది.
తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మలుగు, వరంగల్, జైశంకర్ భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల సహా వివిధ జిల్లాలో కొన్ని చోట్ల ఆకస్మక వర్షాలు, మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది.
మధ్యఆంధ్ర జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కాస్తంత ఉపశమనం లభించవచ్చు. మబ్బులు కమ్మి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. మద్యఆంధ్ర, రాయలసీమ జిల్లాలో 13,14,15,16 తేదీల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, రేపల్లె, విజయవాడ, ఏలూరు, పరిసరప్రాంతాలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, వివిధ జిల్లాలో ఉరుములు, మెరుపుల తో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.